ఆలస్యంగా మహేష్ బాబు చిత్రం ఫస్ట్ లుక్

  • December 26, 2016 / 10:18 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు, కమర్షియల్ డైరక్టర్ మురుగదాస్ కాంబినేషన్లో వస్తున్న సినిమా వేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. గత నెలరోజులుగా గుజరాత్ లోని బిజీ రోడ్లపై కీలక సీన్లు షూట్ చేశారు. 100 కోట్ల బడ్జెట్ తో ఏక కాలంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో సూపర్ స్టార్ ఇన్వెస్ట్ గేషన్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. స్పెషల్ పోలీస్ గా ప్రిన్స్ లుక్ ని చూడాలని అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. తొలుత దీపావళికి వస్తుందని ఆశించి భంగ పడ్డ ఫ్యాన్స్ మరో సారి నిరాశకు గురయ్యారు. జనవరి ఫస్ట్ కి కూడా మహేష్ 23 మూవీ ఫస్ట్ లుక్ విడుదలకావడం లేదని తెలిసింది.

ఈ సినిమా ప్రారంభం నుంచి ఒక్క న్యూస్ కూడా బయటికి రాకుండా కంట్రోల్ చేస్తున్న చిత్ర బృందం టైటిల్ ని కూడా ఇప్పటివరకు వెల్లడించలేదు. కనీసం ఎప్పుడు వస్తుందని ప్రకటన కూడా చేయడంలేదు. ఈ విషయం పై మహేష్ ఫ్యాన్స్ కొంత ఆగ్రహంగా ఉన్నారు. దీనిపై నటుడు ప్రియదర్శి స్పందించారు. పెళ్లి చూపులు సినిమాతో ఆకట్టుకున్న ఇతను.. మహేష్, మురుగదాస్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ యువనటుడు మాట్లాడుతూ… “అద్భుతాన్ని చూడాలంటే కాస్త వెయిట్ చేయాలి. సూపర్ స్టార్ అభిమానుల కోసం దర్శకుడు అద్భుతమైన విజువల్ వండర్ ను సిద్ధం చేస్తున్నారు” అని వివరించారు. దీంతో ఫ్యాన్స్ శాంతించారు. సంతోషించారు. సూపర్ స్టార్ సరసన ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్న ఈ సినిమాకు హరీష్ జయరాజ్ సంగీతమందిస్తున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus