కొడుకుకి సాహస క్రీడలో ట్రైనింగ్ ఇప్పిస్తున్న మహేష్ బాబు

  • December 30, 2016 / 09:05 AM IST

సూపర్ స్టార్ ఇంటిపేరు ఘట్టమనేని అయితే.. ఒంటి పేరు సాహసం. అది కృష్ణ నుంచి వారసత్వంగా వచ్చింది. ప్రిన్స్ చిన్నప్పుడే సినిమాల్లో డూప్ లేకుండా యాక్షన్ సీన్స్ లో నటించారు. ఇప్పటికీ నటిస్తున్నారు. ఇప్పుడు తన కొడుకుకి సాహస క్రీడల్లో దగ్గరుండి ట్రైనింగ్ ఇస్తున్నారు. మొన్నటి వరకు  కమర్షియల్ డైరక్టర్ మురుగదాస్ కాంబినేషన్లో వస్తున్న మూవీ  షూటింగ్ లో బిజీగా ఉన్న మహేష్ భారీ  షెడ్యూల్ పూర్తి కాగానే భార్య నమ్రత, పిల్లలు గౌతమ్, సితార, బావ గల్లా జయదేవ్ కుటుంబంతో కలిసి స్విట్జర్ ల్యాండ్ టూరుకు వెళ్లారు. అక్కడే జురిచ్ లో క్రిస్టమస్ ను సెలబ్రేట్ చేసుకున్నారు. ఇప్పుడు అక్కడి లెస్ ట్రాయిస్ వల్లీస్ మంచుకొండల్లో గౌతమ్ కి ఆల్పైన్ అడ్వంచర్ లో తర్ఫీదు ఇస్తున్నారు.

నమ్రత దగ్గరుండి కొడుకు కాళ్లకి ప్రత్యేక బూట్లు తొడిగి మంచుకొండలపై సాహసానికి పంపించింది. దీనిపై మహేష్ మాట్లాడుతూ “గౌతమ్ కోరిక మేరకే ఈ టూర్ ప్లాన్ చేసాం. చాలా ఇంట్రెస్ట్ గా మంచు కొండలై ప్రయాణిస్తున్నాడు” అని వివరించారు. ఇక కుమార్తె సితార ? ఏమంటుంది అని ప్రిన్స్ ని అడగగా.. “సితార మంచు తో చిన్న గుళ్ళు కట్టుకుంటూ ఆడుకుంటోంది” అంటూ నవ్వేశారు. చిన్నప్పుడే పిల్లల్తో సాహసాలను చేస్తున్న మహేష్ ఫ్యామిలీని చూస్తుంటే..  “భయానికి మీనింగ్ తెలియని బ్లడ్ రా నాది” అంటూ అయన దూకుడు సినిమాలో చెప్పిన డైలాగ్ గుర్తుకొస్తుంటుంది. సూపర్ స్టార్ ఈ టూర్ ముగించుకొని హైదరాబాద్ కి రాగానే మురుగదాస్ సినిమా షూటింగ్ లో పాల్గొననున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus