రీల్ లైఫ్ ని, రియల్ లైఫ్ ని చక్కగా బ్యాలన్స్ చేయగల నటుడు మహేష్ బాబు. సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కుటుంబ సబ్యులకు కేటాయించాల్సిన సమయాన్ని తగ్గించరు. నిన్న ఫాదర్స్ డే సందర్భంగా గౌతమ్, సితారలు మహేష్ కి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. తండ్రిగా మహేష్ కి ఎన్ని మార్కులు ఇస్తారని పిల్లల్ని అడిగితే వారు ఆసక్తికర సమాధానం చెప్పారు. “మా నాన్న వెరీ గుడ్. మా గురించి చాలా కేర్ తీసుకుంటారు.మార్కులు తక్కువ వచ్చినా తిట్టరు. కూల్ గా ఉంటారు. ఇంపార్టెంట్ ఈవెంట్స్ కి తప్పకుండా వస్తారు.” అంటూ గౌతమ్ వివరించారు. అలాగే ఇప్పుడిప్పుడే మాటలు నేర్చుకుంటున్న చిన్నారి సితార కూడా డాడీకి ఫాదర్స్ డే విషెష్ చెప్పింది. “నాన్న వెరీ గుడ్. అన్నయ్య చెప్పాడు కదా” అని డాడీ పై ప్రేమ కురిపించింది.
పిల్లలే కాదు మహేష్ భార్య నమ్రత కూడా ఫుల్ మార్కులు వేశారు. మహేశ్ బాబు ఎలాంటి ఫాదర్? అని నమ్రతను అడగగా .. అందుకు సమాధానమిస్తూ “జస్ట్ లైక్ మా నాన్నలానే. ‘మీకు స్కూల్‌కి వెళ్లాలని లేదా? సర్లే వెళ్లొద్దు. మీకు ఆడుకోవాలని ఉందా? ఆడుకోండి. నిద్ర వస్తుందా.. వెళ్లి పడుకోండి. బొమ్మలు ఏవైనా కావాలంటే వెళ్లి కొనుక్కోండి’ – ఇలా పిల్లలు ఏం అడిగినా… ‘యస్’ చెప్తాడు. మహేశ్ నోటి నుంచి ‘నో’ అనే పదమే రాదు.” అంటూ వివరించారు. ఇంకా మహేష్ గురించి వివరిస్తూ “మహేశ్ ఈజ్ పిల్లర్ ఆఫ్ మై స్ట్రెంగ్త్. నాకే కాదు… మా పిల్లలకు, మా ఫ్యామిలీ అందరికీ మహేశ్ ఎంతో సపోర్ట్. పిల్లలకు, ఫ్యామిలీకి కొంచెం టైమ్ కూడా కేటాయించలేని భర్త అయితే… పరిస్థితి మరోలా ఉండేదేమో! మహేశ్ అలా కాదు. ఎప్పుడూ మాతోనే, మాకు అండగానే ఉంటాడు.” అని నమ్రత చెప్పారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.