ప్రస్తుతం ‘మహర్షి’ సక్సెస్ మూడ్ లో ఉన్న మహేష్ తరువాత అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఓ చిత్రం చేయడానికి రెడీ అయ్యాడు. ఇది మహేష్ బాబు కి 26 వ చిత్రం. ఈ చిత్రానికి ‘రెడ్డి గారి అబ్బాయి’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని సమాచారం. ఇప్పటికే కర్నూల్ సహా పలు లొకేషన్లను ఫైనల్ చేశారట. ఇప్పటి వరకూ మహేష్ ఫ్యాక్షనిస్ట్ గా సినిమా చేయలేదు. అయితే ఇది ఆ తరహా కథేనా అనే దాని పై చర్చ మొదలైంది. ఇది కాస్త పక్కన పెడితే. మహేష్ తో అనిల్ రావిపూడి లాంటి యంగ్ డైరెక్టర్ భారీ చిత్రం చేయగలడా.
ఇప్పటివరకూ మీడియం రేంజ్ ఉన్న హీరోలనే డైరెక్ట్ చేస్తూ వచ్చాడు అనిల్. సాధారణంగా అనిల్ సినిమాల్లో కథ పెద్దగా లేకపోయినా ఎగ్జిక్యూషన్ మాత్రం అదరకొట్టేస్తాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. అంతంత మాత్రం హిట్టయిన ‘మహర్షి’ చిత్రానికే కాలర్ ఎగరేసేస్తుంటే… ఒక మంచి మాస్ హిట్టిస్తే ఇక మహేష్ ఎలా రియాక్ట్ అవుతాడో. మహేష్ అభిమానులు కూడా ‘ఒక్కడు’ తరహా మాస్ చిత్రం కోసం చాలా రోజుల నుండీ ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం గాని అదే స్థాయిలో ఉంటే ‘నాన్ బాహుబలి’ ఏంటి ‘బాహుబలి 1’ నే కొట్టేసినా ఆశ్చర్యపడనక్కర్లేదు.