సూపర్ స్టార్ కొత్త చిత్రం థియేటర్ హక్కుల కోసం క్యూ

సూపర్ స్టార్ మహేష్ బాబు, కమర్షియల్ డైరక్టర్ మురుగదాస్ కాంబినేషన్లో వస్తున్న మూవీ ప్రస్తుతం రెండు షెడ్యూల్ పూర్తి చేసింది. ఏక కాలంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రిన్స్ ఇన్వెస్ట్ గేషన్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. అతనికి జోడీగా ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ రొమాన్స్ చేయనుంది. ఇంకా పేరు కూడా ఖరారు చేయని ఈ చిత్రం థియేటర్ హక్కుల కోసం డిస్ట్రిబ్యూటర్లు ఇప్పటినుంచే క్యూ కడుతున్నారని సమాచారం.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల థియేటర్ హక్కులను సొంతం చేసుకోవడానికి అభిషేక్ పిక్చర్స్ రంగంలోకి దిగినట్లు తెలిసింది. 65 కోట్లు చెల్లించడానికి సిద్ధమైందని, చిత్ర నిర్మాతలు కూడా ఈ రేటుకి ఇవ్వడానికి ఒకే చెప్పినట్లు ఫిలిం నగర్ వర్గాల టాక్. జాతీయ అవార్డు గ్రహీత సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ పనిచేస్తున్న ఈ చిత్రంలో డైరక్టర్ ఎస్.జె సూర్య విలన్ గా నటిస్తున్నారు. వందకోట్లతో నిర్మితమవుతున్న ఈ సినిమా తెలుగు వెర్షన్లోనే 65 కోట్లు పలికితే, తమిళంలో, దేశంలోని ఇతర రాష్ట్రాలతో పాటు, ఓవర్ సీస్ లో ఇంకెంత ధర పలకనుందోనని ట్రేడ్ వర్గాల వారు ఆశ్చర్య పోతున్నారు. ఆడియో, శాటిలైట్ కలుపుకుంటే రిలీజ్ కి ముందే సూపర్ స్టార్ చిత్రం 125 కోట్ల బిజినెస్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.

Mahesh babu Shocking Remuneration for Multi Starrer movie - Filmyfocus.com

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus