టాలీవుడ్ హీరోల ద్విభాషా చిత్రాల ఉధృతి ప్రస్తుత వర్షాల వరదల్లానే ఉంది. మహేశ్, అల్లు అర్జున్ ఆల్రెడీ ప్రకటించగా మరికొందరు చాప కింద నీరులా వ్యవహారం నడుపుతున్నారు. వీరి మాట ఎలా ఉన్నా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ రెండో ద్విభాషా చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయి. తమిళనాట భారీ చిత్రాల నిర్మాత అయిన కలైపులి థాను ఈ మేరకు ప్రయత్నాలు మొదలెట్టారట.
‘రాజారాణి’, ‘థెరి’ (తెలుగులో పోలీస్) చిత్రాల దర్శకుడు అట్లీ వద్ద దర్శకత్వ శాఖలో చేసిన బాస్కో మహేశ్ కోసం ఓ కథ సిద్ధం చేసి నిర్మాత థానుకి వినిపించారట. ఆ కథని మెచ్చుకున్నా థాను నేరుగా మహేశ్-మురుగదాస్ షూటింగ్ లొకేషన్ కి వెళ్లిపోయారట. గ్యాప్ లో లైన్ విన్న మహేశ్ చూచాయగా ఓకే చెప్పారట. పూర్తి కథ రెడీ అయ్యాక ఓ నిర్ణయానికి వచ్చే అవకాశముంది. ఇదిలా ఉంటే మహేశ్ కోసం ఇప్పటికే దర్శకులు భారీగా క్యూ కట్టున్నారు. కొరటాల శివ సినిమా తర్వాతే ఈ సినిమా ఉంటుందన్న ప్రచారం జరుగుతున్నప్పటికీ మహేశ్ నిర్ణయం ఎలా ఉంటుందన్నది ఇప్పుడే చెప్పలేం.