మురుగదాస్ డైరెక్షన్లో ‘స్పైడర్’ సినిమాని దాదాపు కంప్లీట్ చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు, నెక్స్ట్ ప్రాజక్ట్ లోకి ఎంటర్ అయ్యారు. కొరటాల దర్శకత్వంలో చేస్తున్న “భరత్ అను నేను” సినిమా షూటింగ్ లోకి జాయిన్ అయ్యారు. హైదరాబాద్ శివారులో వేసిన అసెంబ్లీ సెట్ లో ఈ మూవీ తెరకెక్కుతోంది. దీని తర్వాత సినిమాని కూడా మహేష్ ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వంశీ పైడిపల్లితో తన 25వ సినిమాను చేయడానికి ఓకే చెప్పారు. దీనిని ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అశ్విని దత్ లు సంయుక్తంగా నిర్మించనున్నారు. ఈ సినిమా గురించి వంశీ పైడిపల్లి రీసెంట్ గా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో వెల్లడించారు. ‘మహేష్ తొలిసారి స్క్రిప్ట్ నరేషన్ విన్నప్పుడు చాలా ఎగ్జైటెడ్ గా ఫీలయ్యారు.
ఒక నటుడిగా ఆయన సినిమా కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నారు. దర్శకుడిగా అది నాకు చాలా ఉత్సాహాన్నిస్తుంది’ అని చెప్పారు. స్టోరీ లైన్ గురించి చెప్పడానికి వంశీ నిరాకరించారు. మహేష్ కెరీర్లో ల్యాండ్ మార్క్ మూవీ కానున్న ఈ ప్రాజక్ట్ కి ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఆర్టిస్టుల, టెక్నీషియన్ల సెలక్షన్ చేస్తున్నారు. హీరోయిన్ గా పూజ హెగ్డేను పరిశీలిస్తున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.