రాజమౌళిని సైతం వదలని కత్తి మహేష్!

  • December 16, 2017 / 02:46 PM IST

బిగ్ బాస్ షో నుంచి బయటికి వచ్చినప్పటి నుంచి కత్తి మహేష్ ఆలోచన విధానం మారింది. తానొక అత్యద్భుతమైన విమర్శకుడిగా భావించుకుంటున్నారు. స్థాయి… సందర్భం.. చూసుకోకుండా నచ్చినట్టు కామెంట్స్ చేస్తున్నారు. మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ ని ప్రశ్నించి.. మీడియా చర్చల్లో పాల్గొన్న కత్తి మహేష్…. ఈ మధ్య తనని ఎవరూ స్టూడియోకి పిలవడం లేదని రాజమౌళి పై విమర్శకు దిగారు.  అతను చేసిన కామెంట్ గురించి తెలుసుకునే ముందు.. అసలు రాజమౌళి ఆలోచన తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో జరగబోయే నిర్మాణాలకు సంబంధించిన డిజైన్లపై కొన్ని సూచనలు చేయాలంటూ రాజమౌళిని చంద్రబాబు కోరిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అసెంబ్లీ భవన డిజైన్‌పై రాజమౌళి ఒక సూచన చేశాడు. ఏపీలో నిర్మించనున్న అసెంబ్లీ భవనానికి సంబంధించిన డిజైన్లలో ఒక దానిని దాదాపు ఖరారు చేశారు.

అందులో ఎత్తైన టవర్‌ నుంచి అసెంబ్లీ సెంట్రల్‌ హాలులోకి సూర్యకిరణాలు పడేలా నార్మన్‌ ఫోస్టర్‌ డిజైన్‌ రూపొందించింది. అయితే దర్శకుడు రాజమౌళి తన మార్కు కళాత్మకతకు పదును పెట్టి, అసెంబ్లీ సెంట్రల్‌ హాలులో తెలుగు తల్లి విగ్రహంపై సరిగ్గా ఉదయం 9.15 గంటలకు కిరణాలు పడేలా ఏర్పాటు చేయాలని సూచించారు. అలా సూర్య కిరణాలు పడుతున్న తెలుగుతల్లి గ్రాఫిక్‌ వీడియోను రూపొందించిన రాజమౌళి దానిని విడుదల చేశాడు. దీనిపై అందరూ అభినందనలు గుప్పిస్తుంటే కత్తి మహేష్ మాత్రం డిఫెరెంట్ గా స్పందించారు. ‘‘తొలి కిరణం.. తెలుగు తల్లి పాదాలను తాకకపోతే వచ్చే నష్టం ఏదైనా ఉందా..?’’ అని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. కత్తి మహేష్ కి ఏమైనా పిచ్చి పట్టిందా?.. అంటూ చాలామంది విమర్శిస్తున్నారు. అయితే ఈ విషయంలో కత్తి మహేష్ ని కొంతమంది సమర్ధిస్తుండడం విశేషం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus