కత్తి మహేష్ మరో వివాదం…!

మహేష్ కత్తి – పవన్ కళ్యాణ్ ఫాన్స్ మధ్యన దాదాపుగా గత రెండు మూడు వారాల నుంచి మంచి వేడి వేడి…మాటల యుద్దం జరుగుతూ ఉంది. అయితే ఈ విషయం ఎప్పుడు తేలుతుంది అనేది తెలీదు కానీ, మొత్తంగా చూసుకుంటే మాత్రం ఈ వేడి ఇప్పటికీ చల్లారినట్టు అయితే కనపడ్డం లేదు. చిన్న విషయాన్ని పెద్ద విషయంగా మార్చి హడావిడి చేస్తున్నారు పవన్ ఫ్యాన్స్ అంటూ కొందరు విమర్శలు చేస్తూ ఉంటే, మరికొందరు మాత్రం పవర్ స్టార్ గురించి ఇలా మాట్లాడితే ఎలా ఊరుకుంటాం అని అంటున్నారు…అయితే తాజాగా మహేష్ మరోసారి ఫేస్ బుక్ వేదికగా రచ్చ మొదలు పెట్టాడు… ఇంకా తన ఫోన్ రింగ్ అవుతూనే ఉంది అనీ తనని చంపేస్తాం అంటూ పవన్ ఫాన్స్ తనని బెదిరుస్తూనే ఉన్నారు అనీ కంప్లైంట్ చేస్తున్నాడు కత్తి మహేష్.

వారిని వదిలేయ్యలా లేక పోలీసు కేసులు పెట్టాలా మీరే చెప్పండి అంటూ మహేష్  ఫేస్ బుక్ లో పోస్ట్స్ పెడుతూ ఉన్నాడు. ఆయన పోస్ట్ లోని సారాంశం ఏంటి అంటే… `నా ఫోన్ ఇంకా రింగ్ అవుతూనే ఉంది. ఇంకా చెప్పాలంటే…సోష‌ల్ మీడియాలో నాకు మ‌ద్ద‌తిచ్చిన‌వారికి కూడా పిచ్చి అభిమానులు ఫోన్లు చేసి వేధిస్తున్నారు. వాళ్ల‌కు కూడా హెచ్చ‌రిక‌లు, బూతు మెసేజ్‌లు వెళ్తున్నాయి. ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానుల సంఘం ఇంకా వివాదాన్ని కొన‌సాగించాల‌నుకుంటోంది. నేను త‌గ్గినా వాళ్లు త‌గ్గ‌డం లేదు. ఇది ఇలాగే కొన‌సాగితే జ‌రిగే ప‌రిణామాల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్‌, కొంత‌మంది అభిమానులు బాధ్య‌త వ‌హించాల్సి ఉంటుంది. పిచ్చి అభిమానులు… వీళ్ల‌ను ఇలాగే వ‌దిలేయాలా? లేక ఏదైనా చ‌ర్య తీసుకోవాలా?… మీ ఇష్టం!` అంటూ మహేష్ పోస్ట్ పెట్టాడు. ఇక ఏ పోస్ట్ పై కూడా పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఫైర్ అవుతూ మహేశ్ పై ఇష్టం వచ్చిన కామెంట్స్ పెడుతూ ఉండడం గమనార్హం. మొత్తంగా అదన్నమాట అసలు కధ.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus