కష్టపడి గొప్ప సినిమాని తీయడమే కాదు.. దానిని సరైన టైమ్ లో రిలీజ్ చేయాలి. అప్పుడే ఆ చిత్రం మంచిపేరుతో పాటు భారీ కలక్షన్స్ రాబట్టేందుకు ఆస్కారం ఉంటుంది. ఆ విషయాన్నీ బాగా గుర్తుపెట్టుకున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. కమర్షియల్ డైరక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో ప్రిన్స్ నటిస్తున్న మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఏక కాలంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో మహేష్ ఇన్వెస్ట్ గేషన్ ఆఫీసర్ గా నటిస్తున్నారు.
అతనికి జోడీగా ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఆడి పాడనుంది. జాతీయ అవార్డు గ్రహీత సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ పనిచేస్తున్న ఈ చిత్రం 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈనెల చివరికి టాకీ పార్ట్ కంప్లీట్ అవుతుంది. సంభవామి అనే టైటిల్ ని పరిశీలిస్తున్న ఈ మూవీని ముందుగా వేసవిలో రిలీజ్ చేయాలనీ అనుకున్నారు. అప్పుడు బాహుబలి కంక్లూజన్ వస్తుందని వెనక్కి తగ్గారు. హడావుడిగా పూర్తిచేసి మార్చిలో రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ మార్చి 24 న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాటమరాయుడు థియేటర్లోకి రానుంది. కావున బాగా ఆలోచించిన మహేష్ బాబు ఏకకంగా వేసవి సెలవులు మొత్తం పూర్తి అయి పెద్ద చిత్రాల హడావుడి తగ్గిన తర్వాత సోలోగా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవాలని ప్లాన్ వేశారు. అటు తమిళం, ఇటు తెలుగు రాష్ట్రాల్లో జూన్ 23 న తన మూవీని రిలీజ్ చేయాలనీ భావిస్తున్నారు. ఇలా సేఫ్ గా వస్తున్నారు
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.