టైటిల్ విషయంలో ఓ నిర్ణయానికి రాలేకపోతున్న సూపర్ స్టార్

  • November 15, 2016 / 06:46 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు, కమర్షియల్ డైరక్టర్ మురుగదాస్ కాంబినేషన్లో వస్తున్న మూవీ ప్రస్తుతం  హైదరాబాద్ లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఏక కాలంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ ఫిల్మ్ కి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. ఇన్వెస్ట్ గేషన్ ఆఫీసర్ గా మహేష్ నటిస్తున్న ఈ మూవీకి  రెండు భాషల్లో సెట్ అయ్యే ఒకే పేరుని డిసైడ్ చేయడం చిత్ర బృందానికి పెద్ద తలనొప్పి అయింది. సూపర్ స్టార్ కూడా టైటిల్ విషయంలో ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు.

ఈ ఫిల్మ్ 60 శాతానికి పైగా షూటింగ్ పూర్తిచేసుకున్నప్పటికీ పేరు ఫిక్స్ చేయకపోవడం కొంత ఆందోళనకు దారి తీస్తోంది. డైరక్టర్ మురుగ దాస్ వాస్కోడిగామా, స్టన్ గన్, ఎనిమీ, ఏజెంట్ శివ, చట్టంతో పోరాటం అనే పేర్లను ప్రిన్స్ పరిశీలనకు ఇచ్చారు.  భారం తన మీద పడడంతో మహేష్ ఆలోచనలో పడ్డారు. ఈ ఐదింటిలో ఒక దాన్ని ఎంచుకుంటారా? లేక కొత్త పేరుని సూచిస్తారా అనేది అతి త్వరలో తెలియనుంది. జాతీయ అవార్డు గ్రహీత సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ పనిచేస్తున్న ఈ చిత్రంలో మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. ఈ మూవీని వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus