మహేష్ సినిమా రిలీజ్ డేట్ రివీల్ చేసిన మురుగదాస్

  • February 25, 2017 / 06:40 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు తొలిసారిగా చేస్తున్న ద్విభాషా చిత్రం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తమిళ డైరక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ దాదాపు 90 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. వందకోట్ల బడ్జెట్ తో ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్న అభిమానులకు డైరక్టర్ శుభవార్త చెప్పారు. “మా అతిథి థియేటర్లోకి జూన్ 23 వస్తున్నాడు.. చాలా ఆతృతగా ఉంది” అంటూ మురుగదాస్ మహా శివరాత్రి నాడు ట్విట్టర్లో వెల్లడించారు. మహేష్ 23 మూవీ జూన్ 23 రిలీజ్ అవుతుందని తన స్టైల్లో చెప్పారు. దీంతో మహేష్ ఫ్యాన్స్ ఆనందపడ్డారు.

ఇన్వెస్ట్ గేషన్ ఆఫీసర్ గా ప్రిన్స్ నటిస్తున్న ఈ చిత్రంలో ఆయన పక్కన ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఆడి పాడనుంది. జాతీయ అవార్డు గ్రహీత సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ పనిచేస్తున్న ఈ సినిమాలో  డైరక్టర్, నటుడు ఎస్.జె.సూర్య విలన్ గా కనిపించనున్నారు. లండన్లో  హాలీవుడ్ గ్రాఫిక్స్ నిపుణుల ఆధ్వర్వంలో ఈ మూవీ టీజర్ కి మెరుగులు దిద్దుతున్నారు. ముప్పై సెకన్ల నిడివి గల టీజర్ రిలీజ్ డేట్ త్వరలో ప్రకటించనున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus