స్పైడర్ తమిళ వెర్షన్ కి డబ్బింగ్ చెప్పే పనిలో మహేష్ బాబు

  • July 4, 2017 / 01:23 PM IST

కమర్షియల్ డైరక్టర్ ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలో మహేష్‌బాబు నటిస్తున్న చిత్రం ‘స్పైడర్‌’ కొన్ని రోజుల క్రితం టాకీ పార్ట్ పూర్తి చేసుకుంది. ఈ ఫుటేజ్ కి ఎడిటింగ్ పూర్తి అవ్వడమే కాదు.. డబ్బింగ్ పనులు కూడా మొదలై పోయాయి. ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి ముందుగా తమిళ వెర్షన్ కి డబ్బింగ్ కంప్లీట్ చేయాలనీ డైరెక్టర్ ఫిక్స్ అయ్యారు. అందుకే ఆ పనులను ప్రారంభించారు. గత రెండు రోజులుగా మహేష్ చెన్నై స్టూడియోలో డబ్బింగ్ చెప్పిన్నట్లు సమాచారం. మహేష్ బాల్యం మొత్తం చెన్నైలో గడిచింది. సో అతనికి తమిళం పై పట్టుంది.

అందుకే తమిళ డైలాగ్స్ ని చకచకా చెబుతున్నట్లు తెలిసింది. రేపటి నుంచి మహేష్ స్పైడర్ పాట చిత్రీకరణలో పాల్గొననున్నారు. కోటిన్నర ఖర్చుతో వేసిన భారీ సెట్ లో మహేష్, రకుల్ ప్రీత్ సింగ్ పై సాంగ్ ని షూట్ చేయనున్నారు. ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్. సినిమా, ఎల్ఎల్పి, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై  ఎన్.వి.ప్రసాద్ నిర్మిస్తున్న స్పైడర్ మూవీ ట్రైలర్ మహేష్ బర్త్ డే ఆగస్టు 9 న రిలీజ్ చేయనున్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus