రెస్ట్ తీసుకోకుండా కొరటాల షూటింగ్ లో జాయిన్ కానున్న మహేష్

  • June 15, 2017 / 11:52 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్లానింగ్ ఎప్పుడూ మిస్ కాలేదు. సినిమాకోసం కష్టపడడం పూర్తి అవ్వగానే ఫ్యామిలీతో కలిసి విహారానికి వెళ్లి విశ్రాంతి తీసుకోవడం ఆయనకి అలవాటు. ఇలా ప్రతి సినిమాకి చేస్తుంటారు. ఈ సారి మాత్రం ఆ ప్లాన్ తప్పింది. కారణం స్పైడర్ మూవీ. కోలీవుడ్ లో ఎంట్రీ మూవీ కావడంతో సినిమా బాగా రావాలని అనుకున్న డేట్స్ కంటే ఎక్కువగా కేటాయించారు. దాంతో సినిమాకి సినిమాకి మధ్య గ్యాప్ తగ్గిపోయింది. కేవలం ఒకే ఒక్కరోజు మాత్రమే విశ్రాంతికి సమయం దొరికింది. మురుగదాస్ డైరక్షన్లో  మహేష్ బాబు నటిస్తున్న స్పైడర్ మూవీ శనివారం (జూన్ 17 ) నాటికీ పూర్తి కానుంది. తర్వాత ఆదివారం రెస్ట్ తీసుకొని కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న “భరత్ అను నేను”  సినిమా షూటింగ్ లో జాయిన్ కానున్నారు.

కొన్ని రోజుల క్రితం మహేష్ బాబు లేకుండా ఈ చిత్రీకరణ మొదలెట్టిన కొరటాల రెండో షెడ్యూల్ ని సోమవారం (జూన్ 19 ) నుంచి ప్లాన్ చేశారు. ఇందుకోసం హైదరాబాద్ సిటీ శివార్లలో ఒక భారీ అసెంబ్లీ సెట్ వేశారు. అందులోనే మహేష్ పై తొలి షాట్ తీయనున్నారు. భారీ బడ్జెట్ తో డి.వి.వి. దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ మహేష్ తో రొమాన్స్ చేయనుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని 2018 సంక్రాంతికి విడుదల చేయనున్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus