రేపు “నరుడా డో నరుడా” ట్రైలర్ విడుదల చేయనున్న సూపర్ స్టార్

అక్కినేని కుటుంబానికి చెందిన హీరో సుమంత్ రెండేళ్ల గ్యాప్ తర్వాత చేస్తున్న సినిమా “నరుడా డో నరుడా” . ఇందులో సుమంత్ వీర్యం దానం చేసే యువకుని పాత్రలో నటిస్తున్నారు. ఇంతవరకు రాని కథతో తెరకెక్కుతున్న ఈ మూవీ టైటిల్ అందరినీ ఆకట్టుకుంది. ఈ డిఫరెంట్ పేరు పెట్టడం వెనుక దర్శకధీరుడు రాజమౌళి ప్రతిభ దాగుందని ఫిలిం నగర్ టాక్. ఈ టైటిల్ ని ఆయనే సుమంత్ కి సూచించారని తెలిసింది.

గతవారం అక్కినేని నాగార్జున విడుదల చేసిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ కి విశేష స్పందన లభించింది. రేపు   “నరుడా డో నరుడా” చిత్రం డిజిటల్ ట్రైలర్ ని సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్నీ నేడు సుమంత్ తన ట్విట్టర్ లో వెల్లడించారు. యువ దర్శకుడు మల్లిక్  రామ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో  సుమంత్ సరసన మరాఠి నటి పల్లవి సుభాష్ నటిస్తోంది.  “ఐ యామ్ స్పెర్మ్ డోనర్.. 100 పర్శంట్ స్ట్రైక్ రేట్ ” అంటూ పంచ్ లైన్ తో వస్తున్న ఈ మూవీ 100 శాతం విజయాన్ని సొంతం చేసుంటుందని చిత్ర బృందం ధీమా వ్యక్తం చేస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus