కొడుకుతో కలిసి మహేష్ తీసుకున్న ఫోటో సూపర్

  • January 7, 2017 / 06:43 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు తన కుటుంబ సభ్యులతో గడపడానికి  ఎక్కువ టైమ్ కేటాయిస్తుంటారు. తమవారి ఫోటోలను మీడియాతో పంచుకోవడానికి ఇష్టపడరు. కానీ తొలిసారిగా ఆయన ఓ ఫోటోని అభిమానులకు కోసం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న ఆ చిత్రం ప్రస్తుతం విపరీతంగా లైక్లు అందుకుంటోంది. ఈ ఫోటో కథలోకి వెళితే..  కమర్షియల్ డైరక్టర్ మురుగదాస్  డైరక్షన్లో చేస్తున్న మూవీ భారీ షెడ్యూల్ పూర్తి అయిన వెంటనే మహేష్ , భార్య నమ్రత, పిల్లలు గౌతమ్, సితార, బావ గల్లా జయదేవ్ కుటుంబంతో కలిసి స్విట్జర్ ల్యాండ్ టూరుకు వెళ్లారు. అక్కడే జురిచ్ లో క్రిస్టమస్, న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నారు.  అక్కడి లెస్ ట్రాయిస్ వల్లీస్ మంచుకొండల్లో గౌతమ్ కి ఆల్పైన్ అడ్వంచర్ లో తర్ఫీదు ఇచ్చారు.

పదిరోజుల పాటు టూర్ ని ఎంజాయ్ చేసి నిన్న సాయంత్రం హైదరాబాద్ కి చేరుకున్నారు. వచ్చి రాగానే టూర్ లో తీసుకున్న ఓ అద్భుత ఫొటోని షేర్ చేసుకున్నారు. అందులో మహేష్, గౌతమ్ లు పక్కపక్కన తలదించుకుని, జర్కిన్ లో చేతులు పెట్టుకొని స్టైల్ గా నడుచుకుంటూ వెళ్తున్నారు. ఈ ఫోటో ప్రిన్స్ అభిమానులతో పాటు నెటిజనులందరికీ బాగా నచ్చింది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus