మహేష్ బాబు, మురుగదాస్ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్

  • March 16, 2017 / 12:51 PM IST

కమర్షియల్ డైరక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న మూవీ షూటింగ్ టాకీ పార్ట్ పూర్తి అయింది. అయినా టైటిల్ కూడా బయటకు రాలేదు. ఫస్ట్ లుక్ రిలీజ్ పై అనేక డేట్స్ ప్రచారంలో వచ్చాయి కానీ, లుక్ విడుదల కాలేదు. ఇన్వెస్టిగేట్ ఆఫీసర్ గా మహేష్ లుక్ చూడాలని అభిమానులు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ సమయం ఆసన్నమయింది. ఉగాదికి తన సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అవుతుందని మహేష్ బాబు చెప్పారు. ఈరోజు ఆయన ఓ వాణిజ్య కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఈ విషయాన్నీ వెల్లడించారు.

తెలుగు సంవత్సరాది ఈనెల 29 వస్తుంది. అంటే మార్చి 28  నే మహేష్ 23 మూవీ లుక్ రిలీజ్ కానుంది. అప్పుడే టైటిల్ కూడా తెలియనుంది. ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్, తమిళ దర్శకుడు ఎస్.జె.సూర్య, హాస్య నటుడు ప్రియదర్శి, తదితరులు నటిస్తున్న ఈ మూవీ జూన్ 23 న థియేటర్లోకి రానుంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus