SSMB 28 Movie OTT Rights : ఊహించని ధరలకు అమ్ముడుపోయిన మహేష్ శ్రీ విక్రమ్ మూవీ డిజిటల్ రైట్స్!

  • January 31, 2023 / 06:28 PM IST

మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా తర్వాత ఈయన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తన 28వ చిత్రాన్ని చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పటికే ఈ సినిమా కాస్త షూటింగ్ పనులను కూడా జరుపుకుంది. అయితే మహేష్ బాబు ఇంట్లో వరుస విషాదాలతో ఈ సినిమా షూటింగ్ కి కాస్త బ్రేక్ ఇచ్చారు. అయితే ప్రస్తుతం ఈ సినిమా తిరిగి షూటింగ్ పనులను ప్రారంభం చేశారు.

ఇకపోతే తాజాగా ఈ సినిమా డిజిటల్ హక్కుల గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ సినిమా విడుదలైన తర్వాత థియేటర్ రన్ పూర్తి చేసుకున్న అనంతరం ఈ సినిమా అన్ని భాషలలోనూ. ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సమస్త నెట్ ఫ్లిక్స్ భారీ ధరలకు కొనుగోలు చేసిందని తెలుస్తుంది. అయితే ఈ సినిమా డిజిటల్ హక్కుల కోసం నెట్ ఫ్లిక్స్ ఏకంగా 80 కోట్ల రూపాయలు చెల్లించినట్టు సమాచారం.

ఇలా అన్ని భాషలలో కలిపి ఈ సినిమా డిజిటల్ హక్కులను 80 కోట్లకు కైవసం చేసుకున్నట్టు తెలుస్తుంది. మరో ప్రక్క నైజాం రైట్స్ దిల్ రాజు 50 కోట్లకు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. మరో ప్రక్క ఏషియన్ సునీల్ సిండికేట్…48 కోట్లు ఆఫర్ చేసారని, నెగోషియేషన్స్ జరుగుతున్నాయని ట్రేడ్ వర్గాల సమాచారం. మరి ఈ సినిమా హక్కులు ఇద్దరిలో ఎవరు సొంతం చేసుకుంటారో తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా ఈ ఏడాది వేసవిలో విడుదల చేయాలని భావించారు.

అయితే ఈ సినిమా పలుమార్లు షూటింగ్ వాయిదా పడటం వల్ల ఈ సినిమాని వచ్చే ఏడాది విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో ఇదివరకే అతడు ఖలేజా వంటి సినిమాలు వచ్చాయి. వీరిద్దరి కాంబినేషన్లు సుమారు 11 సంవత్సరాల తర్వాత మరోసారి సినిమా రావడంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి ఇక ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే శ్రీ లీల నటించబోతున్నారు. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మించబోతున్నారు.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus