సినీ పరిశ్రమలో సీక్రెట్ గా పెళ్లి చేసుకున్న సెలబ్రిటీలు లేదా పెళ్ళైనా రివీల్ చేయని సెలబ్రిటీల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. కానీ అవకాశాల కోసం లేదా క్రేజ్ పోతుంది అనే ఉద్దేశంతో తొందరగా బయటపడరు.ఇలాంటి వాళ్ళ లిస్ట్ ఎక్కువగానే ఉంటుంది. ఉదాహరణకు మన టాలీవుడ్ లో చూసుకుంటే హీరోయిన్ కామ్నా జఠ్మలానీ.. పెళ్ళైనా చాలా కాలం బయటపెట్టలేదు. తర్వాత ఈ విషయాన్ని ఆమె స్వయంగా అంగీకరించింది.బుల్లితెర పై చూసుకుంటే యాంకర్ లాస్య, యాంకర్ రవి..
తమకు పెళ్ళైన విషయాన్ని దాచిపెట్టారు. వాళ్ళు ఓ పొజిషన్ కు వచ్చాక కానీ ఆ విషయాన్ని బయటపెట్టలేదు.బిగ్ బాస్ స్టేజి పై యాంకర్ స్రవంతి చొక్కారపు, గీతు రాయల్ వంటి వారు తమకు పెల్లైనట్టు తెలిపి షాకిచ్చారు. సరిగ్గా ఇలాగే ఓ బాలీవుడ్ నటి పెళ్లి చేసుకుని చాలా కాలం గడిచాక ఆ విషయాన్ని రివీల్ చేసింది. ఆమె మరెవరో కాదు మహి గిల్. ఈమె ప్రముఖ బిజినెస్ మెన్ రవికేసర్ ను వివాహం చేసుకుంది.
అయితే ఎక్కడా కూడా వీళ్లకు పెళ్ళైన విషయాన్ని బయటకు రానివ్వలేదు. అందుకు సంబంధించిన ఒక్క ఫోటో కూడా నెట్లో లీక్ అవ్వకుండా జాగ్రత్త పడ్డారు. సోషల్ మీడియా వాడకం ఓ రేంజ్ లో పెరిగిన ఇలాంటి టైంలో ఇంత సీక్రెట్ గా పెళ్లి చేసుకుని ఎటువంటి గాసిప్ రానివ్వలేదు అంటే వీళ్ళని అభినందించాలి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మహి గిల్ ఈ విషయాన్ని తెలిపింది. ఈమెకు ఇది రెండో పెళ్ళి. ఈమెకు 5 ఏళ్ళ పాప కూడా ఉంది.
శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!
బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!