Major Twitter Review: సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ కు న్యాయం చేశారట..!

2011 నవంబర్ లో జరిగిన ముంబై లో జరిగిన ఉగ్రవాద దాడుల్లో ప్రాణత్యాగం చేశాడు సందీప్ ఉన్ని కృష్ణన్. అతని జీవిత కథతో మేజర్ చిత్రం తెరకెక్కింది. అతని ఫ్యామిలీ లైఫ్, అతని ధైర్య సాహసాలు…. ముంబై ఇన్సిడెంట్ వరకు అతని జీవితంలో జరిగిన ప్రతీ సంఘటన ను ఆధారం చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు.శశి కిరణ్ తిక్క ఈ చిత్రాన్ని డైరక్ట్ చేయగా మహేష్ ఈ చిత్రానికి ఓ నిర్మాతగా వ్యవహరించారు. ఈరోజు అంటే జూన్ 3 న ఈ చిత్రం విడుదలవుతుంది.

అయితే నైట్ నుండే పలు చోట్ల ప్రీమియర్ షోలు వేశారు. సినిమా చూసిన వారంతా ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. కొంతమంది సినిమా చాలా బాగుంది అని చెబుతున్నారు. మరికొంత మంది అయితే అక్కడక్కడా స్లో అయ్యింది అంటున్నారు. బయోపిక్ అన్నాక ఆ మాత్రం స్లో ఉండడం కామన్ అని ఇంకొంతమంది వెనకేసుకొస్తున్నారు. ఏమైనా సందీప్ ఉన్ని కృష్ణన్ కు ఈ చిత్రం గొప్ప ట్రిబ్యూట్ లాంటిదని అంతా అంటున్నారు.

Click Here For Filmy Focus Review

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus