జై బాలయ్య అన్న నినాదం మార్మోగనుంది…తిరుపతి పట్టణం ఈరోజు నందమూరి అభిమానుల కోలాహాలంతో పొటెత్తనుంధీ…అవును ఈరోజే నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గౌతామీ పుత్ర శాతకర్ణి ప్రతిష్టాత్మక చిత్రం ఆడియో వేడుక….ఈ వేడుక తిరుపతి మహానగరంలో భారీగా జరిగేందుకు ఏర్పాట్లు భారీగా జరుగుతున్నాయి.
ఇప్పటిదాకా తెలుగులో ఏ ఆడియో వేడుకా జరగనంత భారీగా ఈ కార్యక్రమాన్ని చేయడానికి నందమూరి అభిమానులు.. తెలుగుదేశం కార్యకర్తలు తిరుపతిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం భారీ మైదానాన్ని సిద్ధం చేస్తున్నారు. అదే క్రమంలో ఈ వేడుకని చూసేందుకు దాదాపుగా లక్షకు పైగా అభిమానులు వస్తారు అని అంచనా వేస్తున్నారు…ఎంత మంది వచ్చినా ఇబ్బంది లేకుండా మైదానాన్ని రెడీ చేస్తున్నారు. భద్రత ఏర్పాట్లకూ ఢోకా లేకుండా చూసుకుంటున్నారు. భారీ కటౌట్లు.. భారీ తెరలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ వేడుకను తెలుగుదేశం పార్టీ వర్గాలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పార్టీ బహిరంగ సభ తరహాలో దీన్ని విజయవంతం చేయడానికి కంకణం కట్టుకుని పని చేస్తున్నారు.
అదే క్రమంలో రాజకీయ ప్రముఖులు ఎందరో ఈ వేడుకకి వస్తూ ఉండడంతో భద్రతా ఏర్పాట్లు సైతం భారీగా జరిగాయి…ముఖ్యంగా ముఖ్య అతిధులుగా….ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు హాజరు అవుతూ ఉండడం, అంతేకాకుండా సినీ.. రాజకీయ ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరు అవుతూ ఉండడంతో తిరుపతి నగరం అంతా ఆనంద కోలాహాలం నెలకొంది. మరి ఈ వేడుక చరిత్రలో నిలిచిపోవాలని ఆశిస్తూ….శాతకర్ణి సంచలన విజయం సాధించాలి అని ఆశిస్తున్నాం.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.