టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ మంచి మనస్సు గురించి ఇండస్ట్రీలో కథలుకథలుగా చెప్పుకుంటారు. ప్రభాస్ మూవీ షూటింగ్ లో పాల్గొంటే ఫుడ్ విషయంలో ప్రభాస్ (Prabhas) ఎంత కేర్ తీసుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదనే సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో బెస్ట్ ఫుడ్ ప్రభాస్ నాకు పంపించారని మాళవిక (Malavika Mohanan) తెలిపారు. మా అమ్మ ఫుడ్ తర్వాత నేను తిన్న బెస్ట్ ఫుడ్ ప్రభాస్ సార్ పంపించిందే అని ఆమె చెప్పుకొచ్చారు.
నేను తీసుకునే ఆహారం మా అమ్మ ఫుడ్ కు ఈక్వల్ గా ఉంటుందని మాళవిక కామెంట్స్ చేశారు. ప్రభాస్ సార్ ది రాజాసాబ్ (The Rajasaab) సినిమాలో క్యారెక్టర్ రావడం నాకు చాలా గ్రేట్ అని అనిపించిందని ఆమె అన్నారు. ఆ పాత్ర చాలా అద్భుతంగా ఉంటుందని మాళవిక చెప్పుకొచ్చారు. దర్శకుడు మారుతి (Maruthi Dasari) ఫిమేల్ రోల్స్ ను చాలా బాగా రాస్తారని ఆమె పేర్కొన్నారు. మీరంతా ది రాజాసాబ్ మూవీ చూడాలని ఎదురుచూస్తున్నారని ఆమె చెప్పుకొచ్చారు.
తంగలాన్ సినిమాలోని నా పాత్రకు పూర్తి వ్యతిరేకంగా ది రాజాసాబ్ సినిమాలో రోల్ ఉంటుందని మాళవిక మోహనన్ అన్నారు. తంగలాన్ (Thangalaan) మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మాళవిక మోహనన్ వెల్లడించడం గమనార్హం. ది రాజాసాబ్ మూవీ 2025 సంవత్సరం ఏప్రిల్ నెల 10వ తేదీన విడుదల కానుంది. ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.
తంగలాన్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొనగా మాళవిక మోహనన్ ఈ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాల్సి ఉంది. మాళవిక మోహనన్ రెమ్యునరేషన్ పరిమితంగానే ఉందని సమాచారం అందుతోంది. మాళవిక మోహనన్ కెరీర్ పరంగా మరిన్ని విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మాళవిక క్రేజ్ అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు.