Director Murali Manohar Reddy: స్పీచ్ ఇస్తూ తన భార్యను తలుచుకుని ఏడ్చేసిన దర్శకుడు.!

ఈ వారం ప్రేక్షకుల ముందుకు పలు చిన్న సినిమాలు రాబోతున్నాయి. అందులో అనసూయ (Anasuya) ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘సింబా’ (Simbaa) మూవీ ఒకటి. ‘వృక్షో రక్షతి రక్షితః’ అనే థీమ్ తో ఈ సినిమా రూపొందినట్లు ట్రైలర్ క్లారిటీ ఇచ్చింది. అనసూయతో పాటు జగపతి బాబు (Jagapathi Babu) , కస్తూరి, దివి (Divya Vadthya), శ్రీనాథ్ (Srinath Maganti), కబీర్ సింగ్ వంటి స్టార్లు కూడా నటించడంతో ‘సింబా’ ప్రత్యేక ఆకర్షణ సంతరించుకుంది. స్టార్ డైరెక్టర్ సంపత్ నంది ఈ చిత్రానికి కథ అందించడం..

అలాగే ట్రైలర్లో ఒక కమెడియన్ అనసూయని ‘నీకు మహేష్ బాబు లాంటి మొగుడొస్తాడు అక్కా లేదంటే విజయ్ దేవరకొండ లాంటి మొగుడొస్తాడు’ అంటూ అనడంతో ‘సింబా’ వార్తల్లో కూడా నిలిచింది అని చెప్పొచ్చు. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకని నిర్వహించింది చిత్ర బృందం. ఈ క్రమంలో డైరెక్టర్ మురళీ మనోహర్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. స్టేజి పైకి వచ్చిన తర్వాత మురళీ మనోహర్..

ఈ సినిమాలో నటించిన అనసూయ వంటి వారందరికీ థాంక్స్ చెప్పాడు. తర్వాత తన సినీ కెరీర్ కి అండగా నిలబడ్డ తన భార్యను అలాగే తన సన్నిహితులని తలుచుకొని ఎమోషనల్ అయ్యాడు. అంతేకాదు తనకి ఏడుపు ఎక్కువగా రావడం వల్ల అనుకుంట.. ఎక్కువ స్పీచ్ కూడా ఇవ్వలేకపోయాడు. సంపత్ నంది (Sampath Nandi) డైరెక్ట్ చేసిన.. ‘ఏమైంది ఈ వేళ’, ‘రచ్చ’ (Racha) , ‘బెంగాల్ టైగర్’ (Bengal Tiger), ‘గౌతమ్ నందా’ (Goutham Nanda) వంటి చిత్రాలకు పనిచేసాడట మనోహర్.

అలాగే సంపత్ నంది నిర్మాణంలో రూపొందిన ‘గాలి పటం’ (Galipatam) కి లైన్ ప్రొడ్యూసర్‌గా, పేపర్ బాయ్ (Paper Boy) చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా కూడా పనిచేశాడు. మరి అతని డైరెక్షన్లో రూపొందిన మొదటి సినిమా ‘సింబా’.. అతనికి ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus