Vijay: కీర్తిని టార్గెట్ చేస్తూ విజయ్ డ్యాన్స్ పై ట్రోల్స్.. అసలేమైందంటే?

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay Thalapathy)  కు ప్రేక్షకులలో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విజయ్ సినిమాలు ఈ మధ్య కాలంలో తెలుగులో కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకుంటున్నాయి. బీస్ట్ (Beast) మినహా విజయ్ నటించిన సినిమాలు తెలుగు రాష్ట్రాల్లో బాగానే కలెక్షన్లను సాధించాయి. అయితే స్టార్ హీరో విజయ్ డ్యాన్స్ పై నెటిజన్లు ట్రోల్స్ చేస్తుండటం గమనార్హం. స్పార్క్ పేరుతో విజయ్ సాంగ్ తాజాగా రిలీజ్ కాగా ఈ సాంగ్ లో విజయ్ స్టెప్స్ పై ఊహించని స్థాయిలో ట్రోల్స్ వస్తున్నాయి.

ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం  (The GOAT) సినిమా నుంచి ఈ సాంగ్ విడుదలైంది. ఈ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా లేదని కామెంట్లు వినిపిస్తుండగా ఈ సాంగ్ విజయ్ డ్యాన్స్ స్టెప్స్ మాత్రం ఎవరినీ ఆకట్టుకునేలా లేవు. విజయ్ డ్యాన్స్ చేస్తారు కానీ కొన్ని సాంగ్స్ లో ఆయన డ్యాన్స్ విమర్శలపాలైన సందర్భాలు అయితే ఉన్నాయి. కీర్తి (Keerthy Suresh) చిరంజీవి (Chiranjeevi)  కంటే విజయ్ డ్యాన్స్ లో గొప్ప అంటూ ఒక సందర్భంలో కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.

అయితే కీర్తిని టార్గెట్ చేస్తూ విజయ్ డ్యాన్స్ పై నెటిజన్లు ట్రోల్స్ చేస్తుండటం గమనార్హం. విజయ్ ఫ్యాన్స్ ఈ కామెంట్ల విషయంలో ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది. విజయ్ డ్యాన్స్ గురించి కీర్తి సురేష్ ప్రశంసించిన వేళ ఈ విధంగా జరగడం విచిత్రమే అని చెప్పాలి. విజయ్ సినిమా రిలీజ్ కావడానికి మరో నెల రోజుల సమయం మాత్రమే ఉంది.

వచ్చే నెల 5వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుందని సమాచారం అందుతోంది. విజయ్ ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాల్సి ఉంది. వెంకట్ ప్రభు డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాల్సి ఉంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus