Devara: ‘చుట్టమల్లె’ సాంగ్ పై ట్రెండ్ అవుతున్న మీమ్స్.!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Jr NTR) హీరోగా కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో ‘జనతా గ్యారేజ్’ వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత రాబోతున్న చిత్రం ‘దేవర’ (Devara). రెండు పార్టులుగా రూపొందుతున్న ఈ చిత్రం మొదటి భాగం ‘దేవర పార్ట్ 1 ‘ గా విడుదల కానుంది.’యువ సుధా ఆర్ట్స్’ బ్యానర్ పై మిక్కిలినేని సుధాకర్ (Sudhakar Mikkilineni) నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ (Kalyan Ram) సమర్పిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి గ్లింప్స్, ఫస్ట్ లిరికల్ సాంగ్ గా ఫియర్ సాంగ్ రిలీజ్ అయ్యింది.

రెండిటికీ మంచి రెస్పాన్స్ లభించాయి. ఫియర్ సాంగ్ అయితే ఓ రేంజ్లో వైరల్ అయ్యింది. అనిరుధ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. తాజాగా ‘దేవర’ సెకండ్ సింగిల్ అయినటువంటి ‘చుట్టమల్లె చుట్టేస్తోంది’ అనే లిరికల్ సాంగ్ బయటకు వచ్చింది. కాసేపటికే ఈ సాంగ్.. వైరల్ గా మారిపోయింది. అయితే చాలా మంది ఈ పాట పై విమర్శలు గుప్పిస్తూ ఉండటం గమనార్హం.

ఈ పాట చింతాల్ సోప్ యాడ్ ని తలపిస్తుందని కొంతమంది, ట్యూన్ ఓ హాలీవుడ్ సాంగ్ నుండి లేపేసాడు అనిరుధ్ (Anirudh Ravichander) అని మరికొంతమంది.. ఇలా రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు. అయితే ట్రోల్ చేసిన సాంగ్స్ కూడా చార్ట్ బస్టర్స్ అయ్యి వందల కొద్దీ మిలియన్ల వ్యూస్ ను కొల్లగొట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ లిస్ట్ లోకి ఈ పాట కూడా చేరొచ్చేమో చెప్పలేం. ప్రస్తుతానికైతే ట్రోలింగ్ తో వార్తల్లో నిలుస్తుంది ఈ మూవీ.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus