సినీ పరిశ్రమలో విషాదాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ ఏడాది చాలా మంది సినీ ప్రముఖులు మరణించారు. ముఖ్యంగా సెప్టెంబర్ నెలలో కృష్ణంరాజు వంటి స్టార్ హీరో అలాగే .. మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి గారు మరణించారు. అలాగే నవంబర్లో సూపర్ స్టార్ కృష్ణ గారు మరణించడం జరిగింది. ఇదే ఏడాది మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు కూడా మరణించారు. అంతేకాకుండా చిన్న చిన్న నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, ఫ్యాషన్ డిజైనర్లు, రచయితలు ఇలా ఎవరొకరు మరణిస్తూనే ఉన్నారు.
ఒక్క టాలీవుడ్లోనే కాదు పక్క రాష్ట్రాల్లోని సినీ హీరోలు, నిర్మాతలు, దర్శకులు, కమెడియన్లు ఇలా ఎవరొకరు మరణిస్తూనే ఉన్నారు. తాజాగా ఓ స్టార్ కమెడియన్ భార్య ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. ప్రముఖ మలయాళ కమెడియన్ ఉల్లాస్ పండలం భార్య ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకుంది. కేరళలోని పతనంతిట్ట జిల్లా పండలంలోని వారి స్వగృహంలో ఆమె ఉరేసుకుని చనిపోయినట్టు పోలీసులు ధృవీకరించారు. ఆమె పేరు స్వాతి. ఆమె వయస్సు కేవలం 38 సంవత్సరాలు మాత్రమే కావడం విషాదకరం.
కొద్దిరోజుల క్రితం తన భార్య ఆశ కనిపించడం లేదని ఉల్లాస్ కేరళ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. తర్వాత పోలీసులు ఆయన నివాసానికి వెళ్లగా అప్పటికే ఆమె గదిలో వేలాడుతూ కనిపించిందట. ఈ క్రమంలో ఉల్లాస్ ఇంట్లో ఉన్నప్పుడే ఆమె మరణించిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కావాలనే ఉల్లాస్ తన భార్య గురించి కంప్లైంట్ ఇచ్చి నేరం తన పై పడకుండా జాగ్రత్తపడుతున్నాడు అని కూడా పోలీసులు అభిప్రాయపడుతున్నారు.
చనిపోయే ముందు రోజు కూడా తన ఇంట్లోని మొదటి అంతస్తులో ఉన్న పిల్లలతో కలిసి స్వాతి టైం స్పెండ్ చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ విషయంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.