Malli Pelli Teaser: ఇది నరేష్- పవిత్రల బయోపిక్కే..!

  • April 21, 2023 / 12:01 PM IST

సీనియర్ నటుడు నరేష్, సీనియర్ నటి పవిత్ర జంటగా నటిస్తున్న చిత్రం ‘మళ్ళీ పెళ్ళి’. నరేష్ గతంలో మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు, పవిత్ర కూడా రెండు పెళ్లిళ్లు చేసుకుంది … అయినా సరే ఈ జంట మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యింది. కానీ నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి.. అతనికి విడాకులు ఇవ్వడానికి అంగీకరించలేదు. దీంతో.. నరేష్ – పవిత్ర లు ప్రస్తుతం సహజీవనం స్టేజిలోనే ఉన్నారు. వీరి పర్సనల్ లైఫ్ కు దగ్గరగా ‘మళ్ళీ పెళ్ళి’ చిత్రం రూపొందుతుండడంతో ఈ సినిమా పై అందరి దృష్టి పడింది.

మరీ ముఖ్యంగా ట్రోలర్స్ దృష్టి పడిందని చెప్పాలి. నరేష్ వికె సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి 50 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. ఈ చిత్రానికి ఆయనే నిర్మాత కావడం విశేషం. తాజాగా ఈ చిత్రం టీజర్ ను కూడా విడుదల చేశారు. ఒక నిమిషం 10 సెకన్ల నిడివి గల ఈ టీజర్ చూస్తుంటే.. ఇది నరేష్ బయోపిక్ అని అర్ధమైపోతుంది. మరీ ముఖ్యంగా నరేష్- పవిత్ర- రమ్య రఘుపతి.. ల మధ్య కొన్నాళ్లుగా చోటు చేసుకున్న సందర్భాలను ఈ టీజర్లో చూపించారు.

రమ్య రఘుపతి ప్లేస్ లో వనితా విజయ్ కుమార్ ఉంది. ఆమె కూడా మూడు పెళ్లిళ్లు చేసుకున్న వ్యక్తే కాబట్టి.. ఈ పాత్రకు ఏరి కోరి ఆమెను ఎంపిక చేసుకున్నట్టున్నాడు నరేష్. ఇక కర్ణాటకలోని మైసూర్ హోటల్లో నరేష్- పవిత్రలు ఉన్నప్పుడు రమ్య రఘుపతి పోలీసులు, మీడియాతో వచ్చి చేసిన రచ్చను ఈ టీజర్లో చూపించారు. ‘మళ్ళీ పెళ్లి’ సినిమాలో నరేష్- పవిత్ర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు అంటే ఇదేదో మిడిల్ ఏజ్డ్ కపుల్ మధ్య జరిగే రొమాంటిక్ చిత్రమని అంతా అనుకున్నారు.

కానీ నరేష్ తన జీవితంలో రమ్య రఘుపతి ఎంటర్ అయిన తర్వాత చోటు చేసుకున్న సందర్భాలను తనకు అనుకూలంగా.. సినిమా తీయించుకున్నాడని టీజర్ తో అందరికీ క్లారిటీ వచ్చింది. (Malli Pelli) ఈ టీజర్ అందరికీ ఇట్టే కనెక్ట్ అయ్యే విధంగా ఉంది. మీరు కూడా ఓ లుక్కేయండి :

శాకుంతలం సినిమా రివ్యూ & రేటింగ్!
అసలు పేరు కాదు పెట్టిన పేరుతో ఫేమస్ అయినా 14 మంది స్టార్లు.!

బ్యాక్ టు బ్యాక్ ఎక్కువ ప్లాపులు ఉన్న తెలుగు హీరోలు ఎవరంటే?
పూజా హెగ్డే కంటే ముందు సల్మాన్ ఖాన్ తో డేటింగ్ చేసిన 13 మంది హీరోయిన్లు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus