Mamitha Baiju: ‘ప్రేమలు’ బ్యూటీ తెలుగు సినిమా ఫిక్స్‌… అయితే హీరో తెలుగు కాదు!

  • July 26, 2024 / 06:44 PM IST

మలయాళం అందానికి టాలీవుడ్‌లో నీరాజనం పలకడం కొత్తేమీ కాదు. గత కొన్ని ఏళ్లుగా ఇదే చేస్తున్నాం. అందుకే మలయాళం సినిమాలో ఓ హీరోయిన్‌ ఆకట్టుకుంది అంటే వెంటనే తెలుగు సినిమాలోకి తీసేసుకోండి అని ఫ్యాన్స్‌ అడుగుతుంటారు. అలా రీసెంట్‌ టైమ్స్‌లో విజయం సాధించి కుర్రాళ్ల గుండెల్లి గిలిగింతలు పెట్టిన అందం మమితా బైజు (Mamitha Baiju) . ‘ప్రేమలు’  (Premalu) సినిమాలో నటించిన ఈమె ఇప్పుడు తెలుగు సినిమా ఓకే చేసింది అంటున్నారు. ‘ప్రేమలు’ సినిమాతో అటు మలయాళ ప్రేక్షకుల్ని, ఇటు తెలుగు ప్రేక్షకులను మెప్పించింది మమిత బైజు.

ఆ వెంటనే ఫాలోయింగ్ కూడా భారీగా పెరిగిపోయింది. దీంతో ‘ప్రేమలు’ బ్యూటీ ఇక్కడికి వస్తే ప్రేమ చూపిద్దాం అనుకున్నారు. అలా మీరు కూడా అనుకొని ఉంటే ఈ వార్త మీ కోసమే. మమిత తొలి తెలుగు సినిమా ఓకే అయింది అని చెబుతున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే త్వరలో అనౌన్స్‌మెంట్ అట. మైత్రీ మూవీ మేకర్స్ త్వరలో ఓ కొత్త సినిమా అనౌన్స్‌ చేయనుంది అని చెబుతున్నారు.

‘లవ్ టుడే’ (Love Today) ఫేమ్‌ ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) హీరోగా మైత్రి వాళ్లు ఓ సినిమా ఓకే చేసుకున్నారు. ఆ సినిమాలో మమిత హీరోయిన్‌గా చేస్తుందని చెబుతున్నారు. ప్రదీప్‌ హీరో అంటే తమిళ సినిమా కదా అని అనుకుంటున్నారా? హీరో తమిళ వ్యక్తే కానీ సినిమా తెలుగుదే అని చెబుతున్నారు. ఆ లెక్కన మమిత తెలుగుకు వచ్చినట్లే కదా. గతంలో ప్రదీప్‌ రంగనాథన్‌ హీరోగా వచ్చిన ‘లవ్‌ టుడే’తో తెలుగు కుర్రాళ్లకు ఇవానా రూపంలో ఓ క్రష్‌ వచ్చింది.

ఇప్పుడు ఈ సినిమాతో ఓ క్రష్ తెలుగులోకి వస్తోంది. ఈ సినిమా కూడా లవ్ టుడే తరహాలో యూత్‌ను టార్గెట్‌ చేసి తీయబోతున్న సినిమా అని చెబుతున్నారు. మరి ఆ కథేంటి, ఆ పాత్రేంటి, మమితా మ్యాజిక్‌ ఎలా ఉండబోతోంది అనేది తెరపైనే చూడాలి. ఓపెనింగ్‌ సమయంలో మమితా ఎలా వస్తుంది అనే ఉత్సుకత కూడా కుర్రాళ్లలో ఉంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus