Usha Parinayam Trailer Review: నెట్టింట్లో వైరల్ అవుతున్న ‘ఉషాపరిణయం’ మూవీ ట్రైలర్..!

‘స్వయంవరం’ ‘నువ్వేకావాలి’ ‘నువ్వు నాకు నచ్చావ్’ (Nuvvu Naaku Nachav) ‘మన్మధుడు’ ‘మల్లీశ్వరి’ (Malliswari) వంటి ఆల్ టైం హిట్ సినిమాలను ప్రేక్షకులకు అందించిన దర్శకులు కె.విజయ్ భాస్కర్ (K. Vijaya Bhaskar)  గారిని అంత ఈజీగా మరచిపోలేము. ఆ సినిమాలు క్లాసిక్స్ గా కూడా నిలిచాయి. ఇక విజయ్ భాస్కర్ గారి దర్శకత్వంలో ఆయన తనయుడు శ్రీ కమల్ హీరోగా ‘ఉషాపరిణయం’ అనే సినిమా రూపొందింది. ఆగస్టు 2న ఈ చిత్రం విడుదల కాబోతోంది. ప్రమోషన్లో భాగంగా విడుదల చేసిన టీజర్, 5 పాటలకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా ట్రైలర్ ని కూడా వదిలారు. ‘ఉషా పరిణయం’ ట్రైలర్ విషయానికి వస్తే.. ఇది 1 : 54 నిమిషాల నిడివి కలిగి ఉంది. ‘నీ గురించి నీకు పూర్తిగా తెలీదు బావ.. మొదటి రోజు కాబట్టి నువ్వు వాళ్ళని భరించలేకపోతున్నావ్. 4 రోజులు పోతే వాళ్ళే నిన్ను భరించలేరు’ అనే ఫన్నీ డైలాగ్ తో హీరో శ్రీ కమల్ ఎంట్రీ ఇవ్వడం జరిగింది.

ఆ తర్వాత హీరోయిన్ తాన్వి ఆకాంక్షతో రొమాంటిక్ ట్రాక్ చూపించారు. ఆ వెంటనే వెన్నెల కిషోర్ (Vennela kishore), అలీ (Ali) , మిర్చి కిరణ్ (Mirchi Kiran).. ల కామెడీ ట్రాక్స్ కి సంబంధించిన విజువల్స్ అట్రాక్టివ్ గా ఉన్నాయి. అటు తర్వాత ఎమోషనల్ ట్రాక్ తీసుకుంది ట్రైలర్. ఫ్యామిలీ ఎమోషన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ‘అందరికీ దెబ్బ మాత్రమే కనిపిస్తుంది..

తల్లికి నొప్పి కూడా తెలుస్తుంది’ అనే డైలాగ్ హైలెట్ గా నిలిచింది ట్రైలర్..కి..! మొత్తంగా ‘ఉషాపరిణయం’ ట్రైలర్ చూస్తుంటే దర్శకులు విజయ్ భాస్కర్ మార్క్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది అనే ఫీలింగ్ కలుగుతుంది. ట్రైలర్ ని మీరు కూడా ఓ లుక్కేయండి :

Read Today's Latest Videos Update. Get Filmy News LIVE Updates on FilmyFocus