Purushothamudu Review in Telugu: పురుషోత్తముడు సినిమా రివ్యూ & రేటింగ్!

  • July 26, 2024 / 04:54 PM IST

Cast & Crew

  • రాజ్ తరుణ్ (Hero)
  • హాసిని సుధీర్ (Heroine)
  • బ్రహ్మానందం, రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, మురళీశర్మ,విరాన్ ముత్తంశెట్టి తదితరులు (Cast)
  • రామ్ భీమన (Director)
  • ప్రకాష్ తేజావత్, రమేష్ తేజావత్ (Producer)
  • గోపీ సుందర్ (Music)
  • పి జి విందా (Cinematography)
  • Release Date : జూలై 26, 2024

ఈ వీకెండ్ కి ధనుష్(Dhanush) , సందీప్ కిషన్ (Sundeep Kishan) ..ల ‘రాయన్’ తో (Raayan) పాటు రాజ్ తరుణ్  (Raj Tarun) ‘పురుషోత్తముడు’ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీజర్, ట్రైలర్.. వంటివి సినిమాపై అందరి దృష్టి పడేలా చేశాయి. మరి వాటికి తగ్గట్టు సినిమా ఉందా లేదా అనేది తెలుసుకుందాం రండి :

కథ : లండన్లో చదువుకుని హైదరాబాద్ కి వస్తాడు రచిత్ రామ్(రాజ్ తరుణ్). తండ్రి(మురళీశర్మ) (Murali Sharma)  అతన్ని తన పరశురామయ్య ఎంటర్ప్రైజెస్ అనే కంపెనీకి సీఈఓని చేయాలని అనుకుంటాడు. అయితే కంపెనీ బైలాస్ ప్రకారం.. సీఈవో అవ్వాల్సిన వ్యక్తి 100 రోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయి,తమ పలుకుబడి ఎక్కడా వాడకుండా సామాన్య జీవితం గడపాలి, తమకు సంబంధించిన వివరాలు గురించి గోప్యంగా ఉంచాలి. లేదు అంటే వారికి సీఈఓ అయ్యే అర్హత ఉండదు అనే విషయాన్ని తెరపైకి తీసుకొస్తుంది వసు(రమ్యకృష్ణ (Ramya Krishna). రచిత్ రామ్ కనుక ఆ షరతును ఉల్లంఘిస్తే తన కొడుకు(విరాన్ ముత్తంశెట్టి) సీఈఓ అవుతాడు అనేది ఆమె అత్యాశ.

ఈ క్రమంలో రచిత్ రామ్.. ఆ షరతులకు లోబడి కట్టుబట్టలతో బయటకు వచ్చేస్తాడు. ఈ క్రమంలో వైజాగ్ వెళ్లే ట్రైన్ ఎక్కితే.. ఊహించని విధంగా కడియంలో దిగాల్సి వస్తుంది. అప్పుడు ఊహించని విధంగా ఆ ఊరిని, అక్కడి రైతులని పీడిస్తున్న పెద్దలతో గొడవ పెట్టుకోవాల్సి వస్తుంది. అది ఎందుకు? తర్వాత ఆ ఊర్లో పూల తోటలు పెంచుతున్న అమ్ములు(హాసిని సుధీర్) కి ఎందుకు దగ్గర కావాల్సి వచ్చింది? చివరికి రచిత్ రామ్ సీఈఓ అయ్యాడా? లేదా? వంటి ప్రశ్నలకు సమాధానమే ఈ ‘పురుషోత్తముడు’

నటీనటుల పనితీరు : రాజ్ తరుణ్ కి ‘శ్రీమంతుడు’ (Srimanthudu)  లో మహేష్ బాబు (Mahesh Babu) చేసిన రేంజ్ రోల్ దొరికింది. తన సెటిల్డ్ పెర్ఫార్మన్స్ తో దానికి న్యాయం చేశాడు. అయితే కొన్ని చోట్ల సడన్ గా గోదావరి స్లాంగ్ లో మాట్లాడటం కొంత మైనస్. హీరోయిన్ హాసిని సుధీర్ తన అందంతో ఆకట్టుకుంది. నటనలో ఇంకా ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉంది. రమ్య కృష్ణ ఎప్పటిలానే హుందాగా నటించి మెప్పించింది. ఆమె కొడుకుగా అల్లు అర్జున్ కి బావమరిది వరస అయ్యే విరాన్ ముత్తంశెట్టి నటించాడు.

ఇతని పాత్ర మొదటి నుండి చివరి వరకు ఫోన్లో గుండాలతో మాట్లాడటానికే పరిమితమైంది. మురళీ శర్మ ఎప్పటిలానే తన సెటిల్డ్ పెర్ఫార్మన్స్ తో మెప్పించాడు. ప్రవీణ్ కామెడీ మాస్ ఆడియన్స్ ని మెప్పించే విధంగా ఉంది. ప్రకాష్ రాజ్..ది అతిథి పాత్రలా అనిపించినప్పటికీ.. చివర్లో ఆ పాత్రతో చెప్పించిన డైలాగులు బాగా పేలాయి. మిగిలిన నటీనటులు పర్వాలేదు అనిపించారు.

సాంకేతిక నిపుణుల పనితీరు : రామ్ భీమన ఎంపిక చేసుకున్న కథ కొత్తదేమీ కాదు. ‘అరుణాచలం’ ‘శ్రీమంతుడు’ ‘బిచ్చగాడు’ ‘పిల్లజమీందార్’ (Pilla Zamindar) వంటి సినిమాల ఛాయలు చాలా ఈ కథలో కనిపిస్తాయి. కానీ స్క్రీన్ ప్లే పరంగా మంచి మార్కులు వేయొచ్చు. బి,సి సెంటర్ ఆడియన్స్ ఎంజాయ్ చేసే సీన్స్ ఈ సినిమాలో ఉన్నాయి. వాళ్లకి లాజిక్స్ తో సంబంధం ఏమీ ఉండదు. పడాల్సిన చోట ఫైట్లు, కామెడీ ఉంటే.. వాళ్ళు టైం పాస్ చేసేస్తారు.కాబట్టి వాళ్లకు ఈ సినిమాని నచ్చే విధంగానే తీర్చిదిద్దాడు దర్శకుడు.

సంభాషణలు కూడా బాగున్నాయి. కొన్ని రోజుల తర్వాత ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో అవి వైరల్ అయ్యే విధంగా ఉన్నాయి. నిర్మాతలు ఖర్చుకి ఎక్కడా వెనకాడకుండా ఈ సినిమాకి పెట్టేశారు. ప్రతి ఫ్రేమ్ పెద్ద హీరో సినిమాల్లో చూసినట్లు రిచ్ గా అనిపిస్తుంది. గోపీసుందర్ (Gopi Sundar) సంగీతం కూడా సినిమాకి ప్లస్ పాయింట్ అని చెప్పాలి. 2 పాటలు గుర్తుండిపోయే విధంగా ఉన్నాయి. రన్ టైం కూడా 2 గంటలే ఉండటం మరో ప్లస్ పాయింట్ గా చెప్పాలి.

విశ్లేషణ : మొత్తంగా ఈ ‘పురుషోత్తముడు’ రొటీన్ గా అనిపించినా.. టైం పాస్ చేయించే విధంగానే ఉంది. రీసెంట్ టైంలో వచ్చిన రాజ్ తరుణ్ సినిమాలతో పోలిస్తే ఇది చాలా బెటర్. బి,సి సెంటర్ ఆడియన్స్ కి నచ్చే అవకాశాలు కూడా ఎక్కువే..!

ఫోకస్ పాయింట్ : ఇది రాజ్ తరుణ్ ‘శ్రీమంతుడు’

రేటింగ్ : 2.5/5

Click Here to Read in ENGLISH

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus