Mamitha Baiju: ఆ దర్శకునిపై షాకింగ్ కామెంట్స్ చేసిన మమితా బైజు.. షాకయ్యానంటూ?

  • February 29, 2024 / 10:43 AM IST

మలయాళంలో చిన్న సినిమాగా విడుదలై ఊహించని స్థాయిలో హిట్ గా నిలిచిన సినిమాలలో ప్రేమలు సినిమా కూడా ఒకటి. ఈ సినిమా తెలుగులో కూడా రిలీజ్ కానుందని తెలుస్తోంది. ప్రముఖ స్టార్ డైరెక్టర్ కొడుకు ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేసే దిశగా అడుగులు వేస్తున్నారని సమాచారం అందుతోంది. ఈ సినిమాలో మమిత బైజు హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా కంటే ముందు సూర్య హీరోగా బాల డైరెక్షన్ లో తెరకెక్కిన వణంగాన్ అనే సినిమాలో మమితా బైజుకు ఛాన్స్ దక్కింది.

అయితే వణంగాన్ మూవీ షూట్ సమయంలో తనకు చేదు అనుభవాలు ఎదురయ్యాయని ఆమె తెలిపారు. డైరెక్టర్ నన్ను తిట్టడంతో పాటు కొట్టాడని ఆమె చెప్పుకొచ్చారు. ఒక ఇంటర్వ్యూలో మమితా బైజు ఈ కామెంట్లు చేశారు.  వణంగాన్  సినిమాలో ఒక సంగీత పరికరాన్ని వాయించే సీన్ ఉంటుందని ఆ సీన్ లో అనుభవం ఉన్న కళాకారిణిలా కనిపించాలని దర్శకుడు సూచించాడని ఆమె తెలిపారు. ఆ సీన్ కు సంబంధించి మూడు టేకులయ్యాయని మధ్యలో డైరెక్టర్ కొన్నిసార్లు తిట్టాడని మమితా బైజు చెప్పుకొచ్చారు.

ఆ తర్వాత డైరెక్టర్ నన్ను కొట్టాడని ఆమె కామెంట్లు చేశారు. సూర్య సర్ కు కూడా ఈ విషయాలు తెలుసని మమితా బైజు వెల్లడించారు. వాళ్లిద్దరూ ఎంతో కాలం నుంచి కలిసి పని చేస్తున్నారని మమితా బైజు అన్నారు. వాళ్ల మధ్య ఆ అనుబంధం ఉందని ఆమె తెలిపారు. నాకిదంతా కొత్త కదా అని ఆమె పేర్కొన్నారు. తర్వాత రోజుల్లో వణంగాన్ మూవీ నుంచి మమితా బైజు, సూర్య బయటికొచ్చేశారు.

దర్శకుడు బాల గురించి ఈ తరహా వివాదాలు ఇదే తొలిసారి కాదు. బాల గతంలో కూడా ఇలాంటి వివాదాల ద్వారా కెరీర్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బాల ఈ కామెంట్ల గురించి ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. (Mamitha Baiju) మమితా బైజు తెలుగులో మరింత బిజీ కావాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

జీవితంలో నేను కోరుకునేది ఇది మాత్రమే.. శోభిత చెప్పిన విషయాలివే!

‘వీరమల్లు’ టు ‘ ఆర్.టి.జి.ఎం 4’ హోల్డ్ లో పడిన 10 ప్రాజెక్టులు ఇవే..!
ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus