Sobhita Dhulipala: జీవితంలో నేను కోరుకునేది ఇది మాత్రమే.. శోభిత చెప్పిన విషయాలివే!

  • February 25, 2024 / 05:50 PM IST

బాలీవుడ్, ఇతర ఇండస్ట్రీలలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతంచేసుకున్న హీరోయిన్లలో శోభిత ధూళిపాళ ఒకరు. గూఢచారి సినిమాతో తెలుగులో ఈ బ్యూటీ క్రేజ్ ను పెంచుకున్నారు. మేజర్ సినిమాతో శోభిత ఖాతాలో మరో సక్సెస్ చేరింది. పొన్నియన్ సెల్వన్ సినిమా శోభిత రేంజ్ ను మరింత పెంచడం గమనార్హం. పలు వెబ్ సిరీస్ ల వల్ల ఈ బ్యూటీ పాపులారిటీ మరింత పెరిగింది. హాలీవుడ్ సినిమాలలో కూడా శోభితకు ఆఫర్లు వస్తున్నాయి.

మంకీ మ్యాన్ అనే హాలీవుడ్ మూవీతో శొభిత మరో సక్సెస్ ను అందుకుంటారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో శోభితకు జీవితానికి అసలైన అర్థం ఏంటనే ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు ఆమె సమాధానం చెబుతూ లైఫ్ లో ఒక లక్ష్యం ఉండాలని నేను అనుకోవడం లేదని ఆమె తెలిపారు. ఒక తీరం నుంచి మరో తీరానికి వెళ్తూ ఉండాలని శోభిత కామెంట్లు చేయడం గమనార్హం.

మనం ఏం చేసినా దాన్ని ఆనందంతో చేయాలని శోభిత పేర్కొన్నారు. నాకంటూ పెద్దపెద్ద లక్ష్యాలు లేవని ఏదో పోగొట్టుకున్న దానిలా నేను ఉండలేనని శోభిత చెప్పుకొచ్చారు. కొన్నిసార్లు నాకు తెలియకుండానే అన్నింటికీ డిస్ కనెక్ట్ అవుతానని ఆమె కామెంట్లు చేశారు. లైఫ్ లో నేను మాతృత్వాన్ని కోరుకుంటానని శోభిత వెల్లడించారు. నిజంగా దాన్ని ఎప్పుడు అనుభవిస్తానో కానీ అదొక అద్భుతంగా ఫీలవుతానని ఆమె తెలిపారు.

అమ్మనవ్వడం, అమ్మ అని పిలిపించుకోవడం ఎంతో బాగుంటుందని అందుకోసం నేను ఎదురుచూస్తున్నానని శోభిత చెప్పుకొచ్చారు. శోభిత వెల్లడించిన విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. శోభిత వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఎన్నో రూమర్లు ప్రచారంలోకి వస్తుండగా ఆమె మాత్రం ఆ రూమర్లను ఖండిస్తున్నారు. శోభిత కెరీర్ పరంగా అంతకంతకూ బిజీ అవుతున్నారు. శోభిత (Sobhita Dhulipala) వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి.

సుందరం మాస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!

మస్తు షేడ్స్ ఉన్నయ్ రా సినిమా రివ్యూ & రేటింగ్!
సిద్ధార్ధ్ రాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus