మెగా సెల్ఫీ ఆలోచన ఆయనదే!
- March 23, 2016 / 06:52 AM ISTByFilmy Focus
సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో అదిరిపోయే సన్నివేశం ఏదైనా ఉందంటే.. అది మెగా బ్రదర్స్ చిరు.. పవన్ ల సెల్ఫీనే. వారిద్దరూ దిగిన సెల్ఫీ హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే.. అసలీ ఐడియా ఎవరిది? అన్నది ఒక ఆసక్తికర చర్చగా మారింది. జాతీయ మీడియాను కూడా ఆకర్షించిన ఈ సెల్ఫీ వెనుక ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉన్నట్లుగా చెబుతున్నారు.
ఆయన ఇచ్చిన ఐడియాతోనే మెగా బ్రదర్స్ ఇద్దరూ కలిసి.. అభిమానులతో సెల్ఫీ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సెల్ఫీ తీసుకునే సమయంలో.. అందరిని కవర్ చేసేలా తీసిన ఒక ఫోటో ఇప్పుడు బయటకు వచ్చిఅందరిని పిచ్చ పిచ్చగా ఆకర్షిస్తోంది. మొత్తానికి బ్లాక్ బస్టర్ సినిమాలే కాదు.. ఇలాంటి ఐడియాలు త్రివిక్రమ్ బుర్రలో చాలానే ఉన్నట్లు తెలుస్తోంది!
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
















