Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Advertisement

‘పెద్ది’ సినిమాకు సంబంధించి గత కొన్ని రోజులుగా జరుగుతున్న చర్చలు రెండు. చాలా రోజులుగా, చాలా రకాల వార్తలు వస్తున్నా ఈ రెండు అంశాల గురించి ఎలాంటి క్లారిటీ లేదు. అవే సినిమా రిలీజ్‌ డేట్‌, స్పెషల్‌ సాంగ్‌లో హీరోయిన్‌. సినిమాకు సంబంధించి పెండింగ్‌ వర్క్‌ అదొక్కటే అని చెబుతారు. రిలీజ్‌ డేట్‌కి సంబందించి గత కొన్ని రోజులుగా రకరకాల వార్తలు వస్తున్నాయి. అందులో ఏది నిజమో చెప్పలేం.

Manasa Varanasi

అలాగే సినిమాలో స్పెషల్‌ సాంగ్‌ చేసే హీరోయిన్‌ ఎవరు అనే విషయంలోనూ చాలా పేర్లు వినిపించాయి. మృణాల్‌ ఠాకూర్‌ పేరు అయితే ఎక్కువగా చర్చలోకి వచ్చింది. ఆమె చరణ్‌తో కలసి ఓ మాస్‌ సాంగ్‌లో చిందేయడం పక్కా అనుకున్నారంతా. కానీ ఆ తర్వాత మరికొన్ని పేర్లు బయటకు వచ్చాయి. ఒకరు కాదు ముగ్గరు నలుగురు హీరోయిన్లు ఆ పాటలో ఉంటారు అని మరో మాట కూడా వినిపించాయి. ఈ క్రమంలో ఓ కుర్ర హీరోయిన్‌ పేరు చర్చలోకి వచ్చింది.

ఇటీవల ‘కపుల్‌ ఫ్రెండ్లీ’ సినిమాతో టాలెంటెడ్‌ కథానాయికగా పేరు తెచ్చుకున్న మానస వారణాసినే ఇప్పుడు చర్చలోకి వచ్చి పేరు. అయితే ఆ సినిమాలో ఆమె కనిపించిన విధానం, ఇప్పుడు ఈ సినిమా కోసం అడుగుతున్న పాత్ర రెండూ చాలా దూరం. మరి మానన ప్రత్యేక గీతంలో నర్తిస్తుందా? అలరిస్తుందా అనేది చూడాలి. అన్నింటికి మించి స్టార్‌ హీరోయిన్ల పేర్లు వినిపించిన ఆ పాటలో నర్తించడం అంటే పెద్ద సవాలే.

ఇక ఈ పాట సంగతి చూస్తే.. చాలా రోజుల క్రితం దీనికి సంబంధించిన పనులు అన్నీ చేసేశారు. ఓ సెట్‌ కూడా సిద్ధం చేశారు. జానీ మాస్టర్‌ నృత్య రీతులు కూడా సమకూర్చేశారు. కానీ సరైన హీరోయిన్‌ దొరక్క ఆలస్యమవుతోంది అని టాక్‌. ఈ పాట పని అయిపోతే కానీ రిలీజ్‌ డేట్‌ చెప్పలేరు అని కూడా అంటున్నారు. ఏప్రిల్‌ 30న రావాల్సిన ‘పెద్ది’ ఎప్పుడు వస్తాడు అనేది పెద్ద రహస్యం అయిపోయింది. జూన్‌ మొదటివారం అనేది ఓ అంచనా.

శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus