సంతోష్ శోభన్, మెహరీన్ కౌర్ హీరో హీరోయిన్లుగా ఎంటర్టైన్మెంట్ చిత్రాలకి కేరాఫ్ అడ్రెస్ అయిన దర్శకుడు మారుతి తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ‘మంచిరోజులు వచ్చాయి’. యువీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు. నవంబర్ 4న దీపావళి కానుకగా విడుదలైన ఈ చిత్రానికి మొదటి షోతోనే ప్లాప్ టాక్ వచ్చింది. దాంతో ఓపెనింగ్స్ చాలా దారుణంగా నమోదయ్యాయి.
ఓసారి ఫస్ట్ వీక్ కలెక్షన్లను గమనిస్తే :
నైజాం
1.03 cr
సీడెడ్
0.46 cr
ఉత్తరాంధ్ర
0.28 cr
ఈస్ట్
0.24 cr
వెస్ట్
0.18 cr
గుంటూరు
0.23 cr
కృష్ణా
0.17 cr
నెల్లూరు
0.15 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
2.74 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
0.12 Cr
ఓవర్సీస్
0.18 Cr
వరల్డ్ వైడ్ (టోటల్)
3.04 cr
‘మంచిరోజులు వచ్చాయి’ చిత్రానికి రూ.8.9 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. కాబట్టి బ్రేక్ ఈవెన్ కు ఈ చిత్రం రూ.9 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. కానీ మొదటివారం పూర్తయ్యేసరికి ఈ చిత్రం కేవలం రూ.3.04 కోట్లు షేర్ ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కు మరో 5.96 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మారుతి మొదటి సినిమాకి కూడా ఇంత ఘోరమైన కలెక్షన్లు నమోదు కాలేదు.