ఆ మెగా హీరోని టచ్ చేయని మంచు ఫ్యామిలీ.. వారిద్దరే టార్గెట్?

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మెగా కుటుంబానికి మంచు కుటుంబానికి ఉన్నటువంటి క్రేజ్ గురించి మనకు తెలిసిందే. ఈ రెండు కుటుంబాలు చిత్ర పరిశ్రమలో ఎంత పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాయి. అయితే ఇండస్ట్రీలో ఈ రెండు కుటుంబాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వివాదాలు కూడా ఉన్నాయి.అయితే ఈ రెండు కుటుంబాల మధ్య జరిగే గొడవలు బహిరంగంగా జరగకపోయినా ఈ రెండు ఫ్యామిలీల మధ్య కోల్డ్ వార్ జరుగుతూనే ఉంది. ముఖ్యంగా మా ఎలక్షన్స్ నుంచి ఈ వివాదాలు మరింత పెరిగిపోయాయి.

ఇకపోతే మా ఎన్నికల సమయంలో మెగా కుటుంబ సభ్యులు నటుడు ప్రకాష్ రాజ్ కు మద్దతు తెలిపారు. ఈ క్రమంలోనే మెగా కుటుంబానికి మంచు కుటుంబానికి మధ్య మాటల యుద్ధం నడిచింది. అయితే మెగా ఫ్యామిలీ సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రకాష్ రాజు మా ఎన్నికలలో ఓటమిపాలయ్యారు..ఇకపోతే మా అధ్యక్షుడిగా గెలుపొందిన మంచు విష్ణు అధ్యక్షత పదవి చేపట్టినప్పటి నుంచి తనపై తీవ్రస్థాయిలో ట్రోలింగ్స్ ఎదురవుతున్నాయి. ఈ విధంగా మంచు విష్ణు గురించి భారీ స్థాయిలో ట్రోల్ రావడంతో ఆయన ఈ నెగటివ్ కామెంట్లపై స్పందిస్తూ

ఇండస్ట్రీకి చెందిన వారే ఉద్దేశపూర్వకంగా తనపై ఇలాంటి నెగటివ్ కామెంట్స్ చేయిస్తున్నారట పరోక్షంగా మెగా స్టార్ ను ఉద్దేశించి చేశారు. ఇక మా అధ్యక్షునిగా పదవి అధిరోహించి ఒక సంవత్సరం పూర్తి అయిన సందర్భంగా మంచు విష్ణు మా అసోసియేషన్ కి ఎవరైనా వ్యతిరేకంగా పోస్టులు చేసిన,లేదా మీడియా ఎదుట మాట్లాడిన వారికి సభ్యత్వం రద్దు చేస్తామని ప్రకటించారు అయితే ఈ వ్యాఖ్యలు మాత్రం మెగా బ్రదర్ నాగబాబును ఉద్దేశించి చేశారని తెలుస్తోంది.

గతంలో నాగబాబు మా అసోసియేషన్ గురించి వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నాగబాబుని ఉద్దేశించి విష్ణు ఈ విధమైనటువంటి కామెంట్స్ చేశారని తెలుస్తోంది. ఇలా మంచు ఫ్యామిలీ మెగాస్టార్ చిరంజీవిని నాగబాబును టార్గెట్ చేస్తూ వారిపై తమదైన శైలిలో కౌంటర్ వేస్తుంటారని, మంచు ఫ్యామిలీ పవన్ కళ్యాణ్ ని మాత్రం టచ్ చేయదని వీరికి వారిద్దరే టార్గెట్ అని తెలుస్తుంది.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus