Manchu Lakshmi: కూతురితో కలిసి స్టెప్పులేసి మంచు లక్ష్మీ.. వీడియో వైరల్!

  • March 10, 2023 / 05:32 PM IST

మంచు మోహన్‌బాబు కుమార్తెగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన మంచు లక్ష్మీ… మొదట పలు టాక్ షోలకు హోస్ట్ గా చేసి పాపులర్ అయ్యింది. అటు తర్వాత ‘అనగనగా ఓ ధీరుడు’ ‘ఊ కొడతారా ఉలిక్కిపడతారా’ ‘గుండెల్లో గోదారి’ ‘దొంగాట’ వంటి చిత్రాల్లో తన నటనతో ఆకట్టుకుంది. ఈ క్రమంలో ఆమెకు బోలెడన్ని ఆఫర్లు వెతుక్కుంటూ వచ్చినా.. అన్నిటికీ ఆమె ఓకే చెప్పలేదు. తనకు మంచి పేరు తెచ్చిపెట్టే సినిమాలనే చేస్తూ వచ్చింది.

మొన్నామధ్య వచ్చిన ‘మాన్స్టర్’ మూవీలో మోహన్ లాల్ తో సమానంగా నటించి ఔరా అనిపించింది ఈ మంచు వారి అమ్మాయి. ఆ సినిమాలో మంచు లక్ష్మీ నటనకు మలయాళంలో కూడా ప్రశంసలు కూడా కురిశాయి. ఇదిలా ఉండగా.. మంచు లక్ష్మీ నుండీ రాబోతున్న నెక్స్ట్ మూవీ ‘అగ్ని నక్షత్రం’. ఈ సినిమా మంచు లక్ష్మీకి చాలా స్పెషల్. ఎందుకంటే తన తండ్రి మోహన్ బాబుతో కలిసి ఆమె నటిస్తున్న మొదటి చిత్రమిది.

వంశీక్షష్ణ మళ్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ‘లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్‌’, ‘మంచు ఎంటర్‌టైన్స్‌మెంట్స్‌’ బ్యానర్లపై మంచు మోహన్‌ బాబు, మంచు లక్ష్మీ కలిసి నిర్మించారు. తాజాగా ఈ చిత్రం నుండి ‘తెలుసా తెలుసా…’ అనే పాటను ఉమెన్స్ డే సందర్భంగా రిలీజ్ చేశారు. స్టార్ హీరోయిన్ సమంత ఈ సాంగ్ ను లాంచ్ చేయడం విశేషం. ఈ పాటలో స్త్రీ గొప్పతనాన్ని, ఆమె శక్తిని తెలియజేసే విధంగా లిరిక్స్ ఉన్నాయి.ఇంకో విశేషం ఏంటంటే.. ఈ పాటలో మంచు లక్ష్మీ కూతురు విద్యా నిర్వాణ మంచు కూడా కనిపించింది.

తన క్యూట్ లుక్స్ తో ఈ పాటకు స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది విద్యా నిర్వాణ. మంచు లక్ష్మీ తన కూతుర్ని ఇంత సైలెంట్ గా సినిమాల్లోకి తెస్తుంది అని ఎవ్వరూ ఊహించలేదు. విష్ణు మంచు కూడా తన కూతుర్లు అరియానా, వివియానా లతో ‘జిన్నా’ మూవీలో ‘ఇది స్నేహం’ అనే పాటను పాడించి సినిమాల్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మంచు లక్ష్మీ వంతు వచ్చినట్టు స్పష్టమవుతుంది. ఇక అచ్చు రాజమణి ‘అగ్ని నక్షత్రం’ చిత్రానికి సంగీతం అందించారు.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus