నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ నటించిన లేడీస్ టైలర్ మూవీ అందరినీ నవ్వించి సూపర్ హిట్ అయింది. ఆ సినిమాకి సీక్వెల్ గా ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్ అనే చిత్రాన్ని వంశీ తెరకెక్కిస్తున్నారు. ఇందులో హీరోగా, లేడీస్ టైలర్ కొడుకుగా సుమంత్ అశ్విన్ నటిస్తున్నారు. మధుర శ్రీధర్ నిర్మిస్తోన్న ఈ సినిమా ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లోకి ఎంటర్ అయింది. ఈ సందర్భం గా చిత్ర బృందం సినిమా ప్రీ లుక్ పోస్టర్ నిమూడు రోజుల క్రితం రిలీజ్ చేసింది. ఇందులో ఓ అమ్మాయి చెస్ట్ కొలతని ఓ అబ్బాయి తీసుకున్నట్లున్న ఫోటో సెక్సీగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ పోస్టర్ పై నిర్మాత, నటి మంచు లక్ష్మి ఘాటుగా స్పందించింది.
“మనం అమ్మాయిలని ఇలా చూపించడాన్ని ఎప్పుడు ఆపుతాం” అని ట్వీట్ చేసింది. ఈమె ట్వీట్ కి అనేక మంది మద్దతు తెలిపారు. వారిలో ఫిట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఉంది. “అవును.. నిజమే. ఈ సినిమా ఎటువంటి సందేశాన్ని సమాజానికి చేరవే స్తుందో ” అంటూ రీ ట్వీట్ చేసింది. సోషల్ మీడియాలో వీరి ట్వీట్స్ జోరుగా ప్రచారం సాగింది. దీంతో నిర్మాత మధుర శ్రీధర్ క్షమాపణలు చెబుతూ “సారీ.. ఈ ప్రీ లుక్ మా చిత్రంలోని ఒక సన్నివేశంలోనిది. మీ అభిప్రాయాన్ని గౌరవిస్తున్నాం. ధన్యవాదాలు” అంటూ పోస్ట్ చేశారు. సో ఈ వివాదానికి ఇంతటితో తెరపడింది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.