టాలీవుడ్, బాలీవుడ్… ఇలా అన్ని వుడ్‌ల నుంచి సినిమా జనాలు మాల్దీవులకు ట్రిప్‌లు వేసేస్తున్నారు. ఇందులో ఎన్ని ఫ్రీ ట్రిప్‌లు, ఎన్ని సొంత డబ్బుల ట్రిప్‌లు అనే లెక్క ఇక్కడ అనవసరం అనుకోండి. తాజాగా మంచు వారి కుటుంబం మాల్దీవుల్లో విహరిస్తుంది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. మోహన్‌బాబు దంపతులు, వారి కుమార్తె లక్ష్మి దంపతులు మాల్దీవుల్లో విహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తన తండ్రికి సర్ప్రైజ్ ఇచ్చింది మంచు లక్ష్మి.
మంచు లక్ష్మీ ప్రసన్న… మామలూగానే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. అందులో ట్రిప్స్ లాంటివాటికెళ్తే ఇంకా యాక్టివ్ అయిపోతుంది. అలా మాల్దీవుల ‘మంచు’ ట్రిప్ ఫొటోలు అభిమానులతో సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. అక్కడ సరదాగా గడిపిన మూమెంట్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ సందర్బంగా ఆమె తన తండ్రిని సర్ప్రైజ్ చేసినట్లు ఓ పోస్టులో రాసుకొచ్చింది. సినిమా చిత్రీకరణలతో బిజీబిజీగా గడిపే మేం ఇలా మాల్దీవులకు వచ్చాం అని రాసుకొచ్చింది.
‘‘నాన్న నటించిన కొన్ని సినిమాల్లోని ఆయనకు బాగా నచ్చే పాటలను ప్లే చేస్తూ… ఆయనకు ఇష్టమైన ఆహార పదార్థాలను ఆర్డర్ చేసి డిన్నర్ చేశాం. ఈ రాత్రి చాలా ఆహ్లాదకరంగా సాగింది’’ అంటూ కొన్ని ఫొటోలు షేర్ చేసింది. ఇలా మా కోసం మేము టైం కేటాయించుకుని చాలాకాలం అయ్యిందని కూడా గుర్తు చేసుకుంది. చాలా రోజుల తర్వాత ఆనందంగా గడిపాం అని పేర్కొంది. మా అందరికి ఎప్పటికి గుర్తుండి పోయే రోజులు ఇవి అని చెప్పుకొచ్చింది మంచు లక్ష్మి.