మెగాహీరోయిన్ తో మంచు అబ్బాయి!

Advertisement

శౌర్య సినిమా త‌ర‌వాత బాగా గ్యాప్ తీసుకొన్నాడు మంచు మ‌నోజ్‌. ఇప్పుడు వ‌రుస‌గా సినిమాల్ని ప‌ట్టాలెక్కిస్తున్నాడు. మ‌నోజ్ క‌థానాయ‌కుడిగా టి.స‌త్య అనే కొత్త ద‌ర్శ‌కుడితో ఓ సినిమా తెర‌కెక్క‌నుంది. స్ర్కిప్టు సిద్ధ‌మైంది. అతి త్వ‌ర‌లో షూటింగ్ కూడా మొద‌లైపోతుంది. ఈలోగా క‌థానాయిక‌ని ఎంపిక చేసే ప‌నిలో ప‌డింది చిత్ర‌బృందం.

మంచు మ‌నోజ్ స‌ర‌స‌న కంచె భామ ప్ర‌గ్యా జైస్వాల్ అయితే బాగుంటుంద‌ని చిత్ర‌బృందం ఫిక్స్ అయింద‌ట‌. కంచెలో ప్య‌గ్యా అందానికీ, అభిన‌యానికీ మంచి మార్కులు ప‌డ్డాయి. ఆ వెంట‌నే నాగార్జున న‌టిస్తున్న ఓం న‌మో వేంక‌టేశాయ‌లో క‌థానాయిక‌గా అవ‌కాశం అందుకొంది. మ‌రో రెండు చిత్రాలు చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉన్నాయి. ఈలోగా.. మ‌నోజ్ సినిమాలో హీరోయిన్ గా ఫిక్స‌యిపోయింది. తెరపై ఈ జంట ఎలాంటి సందడి చేస్తుందో చూడాలి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus