మోహన్ బాబు కనుక మనోజ్ రెండో పెళ్ళికి రాకపోతే ఆ వార్తలు నిజమైనట్టే..!

  • March 2, 2023 / 11:56 AM IST

మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే.ఆల్రెడీ మంచు వారి ఇంట పెళ్లి సందడి మొదలైపోయింది. 2015 లో ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని వివాహం చేసుకున్న మనోజ్.. కొన్ని కారణాల వల్ల 2019 లో ఆమెతో విడిపోయాడు. విడాకుల తర్వాత మనోజ్ డిప్రెషన్ కు లోనయ్యాడు. కొన్నాళ్ల తర్వాత అతని స్నేహితురాలు అయిన భూమా మౌనిక రెడ్డితో ప్రేమలో పడ్డాడు.ఈమె దివంగత టీడీపీ నేత భూమా నాగిరెడ్డి రెండో కుమార్తె.

కొన్నాళ్ళుగా వీరిద్దరూ సహజీవనం కొనసాగిస్తున్నట్టు టాక్ వినిపించింది. ఇది మోహన్ బాబుకు, విష్ణుకు అస్సలు ఇష్టం లేదని కూడా కథనాలు వినిపించాయి.దీనికి ప్రధాన కారణం.. మౌనిక.. టీడీపీ నేత కుమార్తె కావడం …పైగా ఆల్రెడీ పెళ్ళై విడాకులు తీసుకున్న వ్యక్తి కావడం అని ఇన్సైడ్ టాక్ వినిపించింది. మంచు లక్ష్మీ చొరవ చేసుకుని మోహన్ బాబుకు సర్దిచెప్పడంతో ‘మీ ఇష్టం ఇక’ అని ఓ మాట అనేసి సరిపెట్టారట.

మోహన్ బాబు..ప్రస్తుతం జగన్ కు మద్దతుగా ఉంటున్నారు. పైగా విష్ణుకి.. జగన్ బావ వరస కూడా.! కానీ, మనోజ్ మాత్రం ఇష్టపడటంతో విష్ణు కూడా చేసేదేమి లేక లైట్ తీసుకున్నట్లు టాక్ బలంగా వినిపిస్తోంది.అందుకే మోహన్ బాబు తన ఆస్తిలో మనోజ్ వాటా ఇచ్చేసి ప్రైవేట్ గా ఉండమని చెప్పినట్లు తెలుస్తుంది. దీంతో మార్చి 3న మంచు లక్ష్మీ ఇంట్లోనే మనోజ్ పెళ్లి జరగబోతోంది.

కొద్ది పాటు బంధుమిత్రుల.. సాయి ధరమ్ తేజ్, ఎన్టీఆర్ వంటి మనోజ్ స్నేహితులు ఈ పెళ్ళికి హాజరయ్యే అవకాశం ఉంది. తన చిన్న కొడుకు పెళ్ళికి మోహన్ బాబు. మంచు లక్ష్మీ గట్టిగా గట్టిగా నచ్చజెబితే తప్ప ఆయన మనోజ్ పెళ్ళికి హాజరయ్యే అవకాశాలు ప్రస్తుతానికైతే కనిపించడం లేదు అని టాక్ గట్టిగా వినిపిస్తోంది.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus