మనోజ్ పొలిటికల్ స్ట్రాటజీ అదేనా..?

ఎంతో కష్టపడి.. సినిమాలు చేసినప్పటికీ.. ఒక్కటంటే ఒక భారీ హిట్ కూడా సాధించలేకపోయాడు మోహన్ బాబు చిన్న కొడుకు మంచు మనోజ్. ఫైట్స్, డ్యాన్స్, ఇలా అన్ని విషయాల్లోనూ చాలా వర్కౌట్లు చేస్తాడు. అయినప్పటికీ హీరోగా నిలదొక్కుకోలేక పోయాడనే చెప్పాలి. అయితే తన అన్న విష్ణుతో పోలిస్తే మంచి టేస్ట్ ఉన్న హీరో అని ప్రూవ్ చేసుకున్నాడు. సినిమాలు హిట్లు కానప్పటికీ మంచు మనోజ్ కి మంచి క్రేజ్ ఉంది. ఇక సోషల్ మీడియాలో అయితే యమ.. యాక్టివ్ గా ఉంటాడు. తన ట్విట్టర్ ను వేదికగా చేసుకుని.. ఎప్పటికప్పుడు సామాజిక అంశాల పై తనదైన శైలిలో స్పందిస్తుంటాడు.

ఇదిలా ఉండగా… అందుతోన్న సమాచారం మేరకు… త్వరలో మనోజ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నటు తెలుస్తుంది. అందుకు తగినట్టుగానే.. మనోజ్ గత కొద్ది కాలం నుండీ రాజకీయాల కి సంబందించిన.. అంశాల పై పరోక్షంగా కామెంట్లు పెడుతున్నాడు. ఇందులో భాగంగానే… ఇటీవల ఏపికి ప్రత్యేక హోదా విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పై కూడా తనదైన శైలిలో ట్వీట్ చేసాడు. దాంతో పాటూ.. ‘కియా మోటార్స్’ను ఏపీకి తీసుకురావడం పై కూడా మనోజ్ హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసాడు. అయితే గతకొంత కాలంగా మనోజ్ తిరుపతిలోనే ఉంటున్నాడట. తన రాజకీయారంగేట్రం కోసం సీక్రెట్ గా ఓ నియోజిక వర్గం తో మంతనాలు జరుపుతున్నాడట. అంతేకాదు వైసీపీ నుండీ మనోజ్ కి ఎమ్ ఎల్ ఏ టికెట్ కూడా ఆఫర్ ఉన్నట్లు టాక్. మార్చి నుండీ చిత్రీకరణకు అన్నీ సిద్ధం చేసుకున్నాం అని మనోజ్ గతంలో ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇది తన కొత్త చిత్రానికి సంబంధించిన ట్వీట్ అనుకున్నారు అంతా..! కానీ ప్రస్తుతం మనోజ్ కదలికలను బట్టి చుస్తే.. ఏపీలో జరగబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే మనోజ్ ఈ ట్వీట్ చేసినట్లు స్పష్టమవుతుందని సమాచారం. అయితే సినిమాల్లో సక్సెస్ కాని.. ఈ హీరో రాజకీయాల్లో అయినా సక్సెస్ అవుతాడేమో చూడాలి మరి..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus