సైనికుడిగా మంచు వారబ్బాయి!

  • August 3, 2016 / 12:40 PM IST

ప్రయోగాత్మక చిత్రాలను ఎంపిక చేసుకోవడం ముందుంటాడు హీరో మంచు మనోజ్. కేవలం కమర్షియల్ చిత్రాల్లో మాత్రం కాకుండా తన కథల్లో కొత్తదనం ఉండాలని కోరుకుంటాడు. ఆ నేపధ్యంలో వేదం, నేను మీకు తెలుసా’ ఇలాంటి భిన్నమైన కథల్లో నటించాడు. తనకు ఆ సినిమాలు హిట్ ఇస్తున్నాయా.. లేదా..? అని చూడకుండా ప్రయోగాలు చేస్తూనే ఉంటున్నాడు ఈ హీరో.

ఇప్పుడు అదే నేపధ్యంలో మరో సినిమాకు ఒకే చెప్పాడు. ప్రస్తుతం మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న ‘ఒక్కడూ మిగలడు’ సినిమాలో కూడా మనోజ్ పాత్ర వైవిధ్యంగా ఉండబోతోంది. రెండు భిన్నమైన పాత్రల్లో ఆయన కనిపించనున్నారు. అందులో ఒకటి శ్రీలంక సైనిక బృందంలో ఎల్.టి.టి.ఐ సభ్యుడి పాత్ర కావడం విశేషం. మరి ఈ సైనికుడి పాత్రయినా.. మనోజ్ కు హిట్ తెస్తుందేమో చూడాలి!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus