మంచు మనోజ్ టార్గెట్ 15 కేజీలు

పాపం సరైన సినిమా పడక మనోజ్ ఇంకా యంగ్ హీరోల రేస్ లో నిలవలేకపోతున్నాడు కానీ.. నిజానికి మనోజ్ కి ఉన్న యాక్టింగ్ టాలెంట్ కి ఈపాటికి మంచి నటుడిగానే కాక స్టార్ హీరోగానూ ఎదిగేవాడు. అందులోనూ ఈమధ్యకాలంలో వరుసబెట్టి డిజాస్టర్లు పలకరించడంతో తన ఉనికిని సైతం కోల్పోయే స్థాయికి చేరుకొన్నాడు. అందుకే అర్జెంట్ గా తన కథల ఎంపికను మాత్రమే కాదు కారు యాక్సిడెంట్ అనంతరం భారీగా పెరిగిపోయిన తన దేహాన్ని కూడా మార్చుకోవాలని ఫిక్స్ అయ్యాడు. ముందుగా తన బాడీని ఒక షేప్ లోకి తీసుకురావాలని డిసైడైన మనోజ్ థాయ్ ల్యాండ్ లోని పుకెట్ అనే ప్రాంతంలో గల ఒక ట్రయినింగ్ సెంటర్ లో జాయినయ్యాడు. గత రెండు నెలలుగా కఠోరంగా శ్రమించి దాదాపుగా 7 కేజీలు తగ్గాడట.

అయితే.. అంతటితో సాటిస్ఫై అవ్వలేదు మంచు మనోజ్, ఇంకో నెలపాటు అక్కడే ఉండి మరో 8 కేజీలు తగ్గేందుకు సన్నద్ధమవుతున్నాడు. అలాగే.. మాస్ మసాలా సినిమాలను పక్కనపెట్టి ఒక మంచి కాన్సెప్ట్ చేయాలని కూడా ఫిక్స్ అయ్యాడట. ఇటీవల ఓ యువ దర్శకుడు చెప్పిన కథను ఒకే చేసిన మంచు మనోజ్ తన బాడీ షేప్ వర్కవుట్స్ పూర్తవ్వగానే ఆ ప్రొజెక్ట్ ను మొదలెట్టానున్నాడట. చూస్తుంటే.. ఈసారి మనోజ్ బాబు తన కెరీర్ ను కాస్త సీరియస్ గా ప్లాన్ చేసుకొన్నట్లున్నాడు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus