Manchu Vishnu: ఆ విషయంలో తప్పు తెలిసొచ్చిందన్న మంచు విష్ణు!

ప్రముఖ టాలీవుడ్ నటులలో ఒకరైన మంచు విష్ణు నటించిన సినిమాలలో సక్సెస్ సాధించిన సినిమాల కంటే ఫ్లాపైన సినిమాలే ఎక్కువనే సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో మంచు విష్ణుకు వరుస షాకులు తగులుతుండగా జిన్నా సినిమాతో విష్ణు మరో రెండో రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమాకు భారీ స్థాయిలోనే ప్రమోషన్స్ చేస్తున్నప్పటికీ విష్ణు ట్రాక్ రికార్డ్ వల్ల ఈ సినిమాకు బుకింగ్స్ ఆశించిన రేంజ్ లో లేవు.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విష్ణు మాట్లాడుతూ జిన్నా సినిమా తన దగ్గరకు రావడానికి ముందే ఈ సినిమాలో సన్నీ లియోన్ కన్ఫామ్ కావడం జరిగిందని తెలిపారు. జిన్నా మూవీ సన్నీ లియోన్ కెరీర్ కు కూడా ప్లస్ అవుతుందని విష్ణు అభిప్రాయం వ్యక్తం చేశారు. జిన్నా రిలీజ్ తర్వాత సన్నీకి సినిమా ఆఫర్లు పెరిగే అవకాశం అయితే ఉందని విష్ణు వెల్లడించడం గమనార్హం. సన్నీలియోన్ దగ్గరినుంచి సోషల్ మీడియాను ఎలా వాడాలో తెలుసుకున్నానని విష్ణు తెలిపారు.

ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం ఊహించని రేంజ్ లో పెరిగిందని విష్ణు కామెంట్లు చేశారు. సన్నీ లియోన్ ద్వారా నేను కొన్ని ట్రిక్స్ ను నేర్చుకున్నానని విష్ణు చెప్పుకొచ్చారు. కామెడీ, యాక్షన్ ఎంటర్టైనర్లలో తాను నటించిన ప్రతిసారి సక్సెస్ దక్కిందని విష్ణు వెల్లడించారు. ఎలాంటి సినిమాలలో నటించాలో ఎలాంటి సినిమాలలో నటించకూడదో నేను తెలుసుకున్నానని విష్ణు పేర్కొన్నారు.

కామెడీతో కూడిన కథలలో మాత్రమే నేను నటిస్తానని నా తప్పును నేను తెలుసుకున్నానని విష్ణు కామెంట్లు చేశారు. ఢీ సినిమా సీక్వెల్ లో తాను నటిస్తానని ఢీ2 స్టోరీపై వర్క్ జరుగుతోందని విష్ణు తెలిపారు. జిన్నా ఇంటర్వెల్ ప్రేక్షకులకు ఆశ్చర్యం కలిగించేలా ఉంటుందని విష్ణు కామెంట్లు చేశారు. సోషల్ మీడియాలో తాను ఏం మాట్లాడినా వివాదం అవుతోందని విష్ణు చెప్పుకొచ్చారు.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus