మంచు విష్ణు “లక్కున్నోడు”

  • August 11, 2016 / 07:37 AM IST

జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ హీరోగా గుర్తింపు తెచ్చుకోవడానికి నానా పాట్లూ పడుతున్న యువకథానాయకుడు మంచు విష్ణుకు ఇటీవల “ఈడోరకం ఆడొరకం” చిత్రంతో ఓ మోస్తరు విజయం దక్కింది. ఆ తర్వాత కొన్నాళ్లపాటు దొరక్కదోరక్క దొరికిన సక్సెస్ ను ఎంజాయ్ చేసిన విష్ణు బాబు ఇప్పుడు కొత్త సినిమా పనుల్లో బిజీ అవుతున్నాడు. యాక్షన్ ఎంటర్ టైనర్లు తనకు ఎలాగూ అచ్చిరాలేదు కాబట్టి.. తనకి బాగా కలిసొచ్చిన కామెడీ జోనర్ లోనే మరో చిత్రం చేసేందుకు సన్నద్ధమవుతున్నాడు.

“గీతాంజలి, త్రిపుర” లాంటి హారర్ కామెడీ చిత్రాలతో డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకొన్న రాజ్ కిరణ్ దర్శకత్వంలో ఓ ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్ టైనర్ చేసేందుకు మంచు విష్ణు పచ్చ జెండా ఊపినట్లు సమాచారం. ఈ చిత్రానికి “లక్కున్నోడు” అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేసేశారట. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. విష్ణు బాబు హీరోయిన్ ను సెలక్ట్ చేసుకొనే పనిలో ఉన్నాడట!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus