Mani Sharma: కాపీ విమర్శలపై మణిశర్మ రియాక్షన్ ఇదే.. మా తప్పు కాదంటూ?

  • January 4, 2024 / 11:24 AM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్లలో మణిశర్మ ఒకరనే సంగతి తెలిసిందే. ఒకప్పుడు వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న మణిశర్మ ప్రస్తుతం సరైన ఆఫర్లు లేకపోవడంతో కెరీర్ విషయంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. స్టార్ హీరోలు ఎవరూ మణిశర్మకు ఛాన్స్ ఇవ్వడం లేదు. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన మణిశర్మ ఆ ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలను వెల్లడించారు. జూనియర్ ఎన్టీఆర్ ఆది సినిమాకు బలవంతంగా కాపీ ట్యూన్స్ చేయించారని ఆయన అన్నారు.

కాపీ ట్యూన్స్ కు సంబంధించి నన్ను ఫోర్స్ చేశారని నాకు ఇష్టం లేకపోయినా బలవంతంగా కాపీ ట్యూన్స్ చేయించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. ఆది సినిమాలోని చిక్ చిక్ బం బం సాంగ్ కాపీ అని కాపీ చేయడం ఏ కంపోజర్ కు ఇష్టం ఉండదని ఆయన తెలిపారు. ఇష్టం లేకపోయినా ఆ సినిమాకు కాపీ ట్యూన్ ఇవ్వాల్సి వచ్చిందని మణిశర్మ అన్నారు. అయితే ఆ సినిమాకు కాపీ ట్యూన్ ఇవ్వాలని ఎవరు బలవంతం చేశారో మాత్రం మణిశర్మ చెప్పలేదు.

ఒక టర్గెన్ సాంగ్ కు కాపీగా ఈ సాంగ్ తెరకెక్కింది. మరోవైపు పవన్, మహేష్ సినిమాలకు ఛాన్స్ వస్తే బాగుంటుందని ఆయన అన్నారు. ఈ ఇంటర్వ్యూలో మణిశర్మ చెప్పిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. మణిశర్మ మ్యూజిక్ ను అభిమానించే వాళ్ల సంఖ్య పెరుగుతోంది. మణిశర్మ ప్రస్తుతం పరిమితంగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.

మణిశర్మకు (Mani Sharma) ఇతర భాషల్లో సైతం మంచి పేరు ఉంది. మణిశర్మ ఓల్డ్ సాంగ్స్ కు ఈ జనరేషన్ లో సైతం ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. మణిశర్మ రేంజ్ అంతకంతకూ పెరగాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. 2024 సంవత్సరం మెలోడీ బ్రహ్మ మణిశర్మ కెరీర్ లో స్పెషల్ ఇయర్ గా నిలవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus