మంజిమా మోహన్.. ఈమె తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. నాగ చైతన్య హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపొందిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ చిత్రం పెద్దగా ఆడలేదు కానీ ఎ.ఆర్. రెహమాన్ సంగీతంలో రూపొందిన పాటలు మాత్రం సూపర్ గా ఉంటాయి. అలాగే మంజిమా నటన కూడా హైలెట్ గా ఉంటుందనే చెప్పాలి. ఆ సినిమా సక్సెస్ అవ్వకపోవడంతో తెలుగులో ఈమెకు ఎక్కువ ఆఫర్లు రాలేదు.
‘ఎన్టీఆర్ బయోపిక్’ గా తెరకెక్కిన ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ ‘ఎన్టీఆర్ మహానాయకుడు’ వంటి చిత్రాల్లో నారా భువనేశ్వరి పాత్రలో అంటే రానా(చంద్రబాబు) భార్య పాత్రలో నటించింది. తమిళ, మలయాళంలో మాత్రం ఈమె మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఇదిలా ఉండగా.. సైలెంట్ గా ఎంగేజ్మెంట్ చేసుకుని అందరినీ సర్ప్రైజ్ చేసింది ఈ బ్యూటీ. ‘కడలి’ చిత్రంతో హీరోగా పరిచయమైన గౌతమ్ కార్తీక్ తో ఈమె పెళ్లికి సిద్ధమైంది. ఇతను సీనియర్ హీరో కార్తీక్ తనయుడు అన్న సంగతి తెలిసిందే.
మూడేళ్ళ క్రితం గౌతమ్ – మంజిమ ల మధ్య ప్రేమ చిగురించింది. ఇప్పటివరకు వాళ్ళు డేటింగ్ లోనే ఉన్నారు.”మూడేళ్ళ క్రితం నువ్వు నా జీవితంలోకి ఓ దేవదూతలా వచ్చావు. జీవితం పై నాకున్న దృక్పథాన్ని మార్చేసావు. అందుకు నేను ధన్యురాలిని. నేను గందరగోళానికి గురైన ప్రతీసారి నాకు చేయి అందించావు. నా లోపాలను కూడా యాక్సెప్ట్ చేసినందుకు … నన్ను నాకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నందుకు …
నాతో ఎల్లప్పుడూ నాకు ఇష్టమైన ప్రతిదానిలో తోడుగా ఉంటానన్నందుకు.. నా జీవితంలో అన్నిటికంటే నాకు ముఖ్యమైనందుకు..’ అంటూ ఎమోషనల్ గా ఇన్స్టాగ్రామ్ లో పేర్కొంది. అలాగే ఓ రొమాంటిక్ ఫోటోని కూడా షేర్ చేసింది. త్వరలోనే ఈ జంట పెళ్లిపీటలెక్కనుంది అని కోలీవుడ్ సమాచారం. పెళ్లి డేట్ ను కూడా ఈ జంట త్వరలోనే ప్రకటించనుంది.