‘బిగ్ బాస్ సీజన్ 6’ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోతుంది అనే చెప్పాలి. ఈసారి ముక్కు మొహం తెలీని కంటెస్టెంట్లు చాలా మంది ఎంట్రీ ఇచ్చారు. అందువల్ల ఈ సీజన్ సక్సెస్ కాలేకపోయింది. ఏ వారం ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అనే విషయాన్ని జనాలు పట్టించుకోవడం లేదు. 11 వారాలు గడిచినా సరే బిగ్ బాస్ కొత్త సీజన్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అనే వాళ్ళు ఎక్కువ మందే ఉన్నారు అంటే బిగ్ బాస్6 ఎంత ఫెయిల్యూర్ అనేది అర్థం చేసుకోవచ్చు.
ఇదిలా ఉండగా.. ఈ సీజన్ లో హౌస్ లోని అందరి ఆకలి తీరుస్తూ మదర్ ఇండియాగా పేరు తెచ్చుకుంది కంటెస్టెంట్ మెరీనా. తన భర్త రోహిత్ తో కలిసి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన మెరీనా.. గొడవలకు చాలా వరకు దూరంగానే ఉంటూ వచ్చింది.హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన కపుల్ వీళ్ళు మాత్రమే కాబట్టి.. జనాలకు ఈమె ఎక్కువగానే తెలిసుంటుంది. అంతేకాక ఇటీవల ఆమె దుప్పట్లో దూరి తన భర్త రోహిత్ కి ముద్దు ఇవ్వడంతో మరింత హైలెట్ అయ్యింది.
ఇలాంటివి పక్కన పెట్టేస్తే ఈమె పై నెగిటివ్ పాయింట్స్ పెద్దగా లేవు అనే చెప్పాలి. ఇదిలా ఉండగా.. ఈమె 11 వారాలు హౌస్ లో ఉండి వచ్చిన మెరీనాకి ఎంత పారితోషికం అందుంటుంది అనే డౌట్ ఎవ్వరికైనా రావచ్చు. అందుతున్న సమాచారం ప్రకారం… ఈమెకు ఒక్కో వారానికి గాను రూ.38 వేలు చొప్పున పారితోషికం ఇచ్చారట.
అంటే 11 వారాలకు గాను ఈమెకు రూ.3,80,000 నుండి రూ.4,00,000 వరకు పారితోషికం అందినట్టు తెలుస్తోంది. మెరీనా పలు సీరియల్స్ ద్వారా పాపులర్ అయ్యింది. తన భర్త రోహిత్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.