Maruthi, Chiranjeevi: మారుతి డైరెక్షన్ లో చిరంజీవి!: మారుతి

మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈయన వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ పనులు ప్రారంభమయ్యాయి. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ భావించారు. ఇకపోతే చిరంజీవి వరుస సినిమాలలో నటిస్తున్నటువంటి తరుణంలో ఆయన నుంచి ఒక వింటేజ్ కామెడీ బ్యాక్‌డ్రాప్ మూవీని కోరుకుంటున్నారు.

ఫ్యాన్స్ కోరుకుంటున్న ఈ కోరిక చిరంజీవి వరకు వెళ్ళింది. ఆయన కూడా అలాంటి ఓ సినిమా చేయాలని చిరంజీవి భావించారు. ఈ క్రమంలోనే కొంతమంది దర్శకుల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి ఇలా వచ్చినటువంటి వారిలో మారుతి కూడా ఒకరు. మారుతి డైరెక్షన్లో చిరంజీవి కామెడీ బ్యాక్ డ్రాప్ మూవీని చేయడం కోసం సిద్ధమయ్యారని తెలుస్తుంది. ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈ విషయాలను డైరెక్టర్ మారుతి వెల్లడించారు.

తాను చిరంజీవి గారిని కలిసి ఒక కథ చెప్పానని వెల్లడించారు. అయితే ఈ కథ చిరంజీవి గారికి బాగా నచ్చిందని ప్రభాస్ కంటే ముందుగా చిరంజీవితోనే తాను ఈ సినిమా చేయాల్సి ఉండేదని ఈయన వెల్లడించారు. ఇక చిరంజీవి గారికి కథ చెప్పిన తర్వాత ప్రభాస్ కి కూడా రాజాసాబ్ కథ చెప్పానని ప్రభాస్ రాజా సాబ్ కథకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో చిరంజీవి సినిమాను పక్కనపెట్టి ప్రభాస్ తో సినిమా చేస్తున్నానని తెలిపారు.

ఈ సినిమా పూర్తి కాగానే చిరంజీవితో తన తదుపరి ప్రాజెక్టు మొదలవుతుందని మారుతి వెల్లడించారు. ప్రస్తుతం చిరంజీవి విశ్వంభర సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తి అయ్యేలోపు రాజా సాబ్ పూర్తి అవుతుందని ఆ తర్వాత చిరంజీవితో తన ప్రాజెక్టు మొదలు కాబోతోంది అంటూ మారుతి (Maruthi) చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus